AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒకే ఓవర్‌లో 4 నోబాల్స్‌, అయినా గుర్తించని అంపైర్.. వార్నర్ దెబ్బకు అసలు విషయం వెలుగులోకి..!

ENG vs AUS: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో బెన్ స్టోక్స్ పొరపాటు చేశాడు. అయితే ఈ తప్పు ఆలస్యంగా థర్డ్ అంపైర్ దృష్టికి వచ్చింది.

Watch Video: ఒకే ఓవర్‌లో 4 నోబాల్స్‌, అయినా గుర్తించని అంపైర్.. వార్నర్ దెబ్బకు అసలు విషయం వెలుగులోకి..!
Ashes Series Ben Stocks, David Warner
Venkata Chari
|

Updated on: Dec 09, 2021 | 9:47 AM

Share

ENG vs AUS: బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ పెద్ద తప్పిదం చేశాడు. బెన్ స్టోక్స్ వేసిన 13వ ఓవర్‌ను అంపైర్ గమనించడం మానేసినట్లే అనిపించింది. ఈ ఓవర్‌లో నాలుగో బంతికి డేవిడ్ వార్నర్‌ను స్టోక్స్ బౌల్డ్ చేశాడు. అప్పుడు థర్డ్ అంపైర్ నో బాల్‌ని తనిఖీ చేయగా, స్టోక్స్ ఫుట్ క్రీజ్ వెలుపల ఉందని తేలింది. దీంతో డేవిడ్ వార్నర్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. అంతకుముందు వేసిన మూడు బంతుల్లో అంపైర్ తప్పు చేయలేదు. నిజానికి, నేటి క్రికెట్‌లో, ప్రతి బంతి తర్వాత థర్డ్ అంపైర్ ఆ బంతి నో బాల్ కాదా అని చెక్ చేస్తారు. ఈ ఓవర్‌లో వార్నర్ ఔట్ అయినప్పుడు మాత్రం అంపైర్ ఈ విషయాన్ని చెక్ చేయడం విశేషం. అయితే అంతకుముందు మూడు బంతులు కూడా నో బాల్స్ వేశాడు. వాటిని అంపైర్ చెక్ చేయడంలో విఫలమయ్యాడు.

స్టోక్స్ వేసిన మొదటి మూడు బంతులు కూడా నోబాల్స్‌ కావడం విశేషం. అయితే వీటిని అంపైర్ గమనించడలేదు. ఇక నాలుగో బంతికి వార్నర్ భారీ షాట్ ఆడాడు. అది బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత అంపైరింగ్‌ను ప్రశ్నించడంలో మాజీలు, నెటిజన్లు మునిగిపోయారు. ఆ సమయంలో వార్నర్ 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో పాల్ విల్సన్ థర్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు.

మాజీలు ఏమన్నారంటే..! సెవెన్ క్రికెట్‌తో మాట్లాడుతూ మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. “ప్రతి బంతిని చెక్ చేయడం అంపైర్ పని. ఇది మాత్రం నేను వర్ణించలేను” అంటూ కామెంట్ చేశాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ దీనిని ‘పూర్ అంపైరింగ్’‌గా పిలిచాడు.

ఆస్ట్రేలియాదే ఆధిపత్యం.. వార్నర్ ప్రభావంతో రెండో రోజు తొలి సెషన్ లోనే ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 10 పరుగుల వద్ద ఆరో ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్‌ను ఇంగ్లండ్ అవుట్ చేసింది. హారిస్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. వార్నర్, మార్నస్ లాబుషాగ్నేతో జతకట్టాడు. వీరిద్దరూ ఇక్కడి నుంచే ఇంగ్లండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. స్టోక్స్ వేసిన బంతికి లైఫ్ లభించిన వార్నర్‌కు అదృష్టం కలిసి వచ్చింది. అతను దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. లంచ్ వరకు లాబుస్‌చాగ్నేతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి సెషన్ ముగిసే వరకు లాబుస్‌చాగ్నే 53 పరుగులు చేశాడు. ఇందుకోసం 77 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో పాటు ఒక సిక్సర్ కొట్టాడు. డేవిడ్ వార్నర్ లంచ్ వరకు 48 పరుగులు చేశాడు. ఇందుకోసం 94 బంతులు ఆడి నాలుగు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు బాదాడు.

Also Read: IND vs SA: కోహ్లీ వన్డే కెప్టెన్సీ అందుకే చేజారిందా.. సారథి మార్పులో ప్రభావం చూపిన కారణాలు ఏంటంటే?

Rohit Sharma: భారత వన్డే సారథికి మరోసారి కలిసొచ్చిన డిసెంబర్.. మైదానం లోపల, బయట ఎన్నో మైలురాళ్లు.. అవేంటంటే?