- Telugu News Photo Gallery Cricket photos Team India new Skipper Rohit Sharma's happy days in December, From Captaining Indian Team to Marrying and becoming father
Rohit Sharma: భారత వన్డే సారథికి మరోసారి కలిసొచ్చిన డిసెంబర్.. మైదానం లోపల, బయట ఎన్నో మైలురాళ్లు.. అవేంటంటే?
Rohit Sharma-Virat Kohli: విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ భారత వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. మొదటి సిరీస్ దక్షిణాఫ్రికాతో జరగనుంది.
Updated on: Dec 09, 2021 | 7:42 AM

భారత వన్డే, టీ20 జట్టుకు రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. డిసెంబర్ 8 బుధవారం నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి విరాట్ కోహ్లీ నుంచి వన్డే కెప్టెన్సీని లాక్కొని రోహిత్‌కి ఈ బాధ్యతను అప్పగించింది. దీంతో రోహిత్ కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పటి నుంచో గొప్పగా నిరూపించుకున్న డిసెంబర్ నెల యాదృచ్ఛికం మరోసారి తనపై ఉన్న లక్‌ను బయటపెట్టినట్లయింది.

కెప్టెన్సీ నుంచి బ్యాటింగ్ వరకు రోహిత్‌కి డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. వన్డేలు, టీ20ల్లో రోహిత్ తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ గైర్హాజరీతో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

డిసెంబర్ 2017లోనే కెప్టెన్‌గా, రోహిత్ శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ ఉమ్మడి రికార్డును సృష్టించాడు. రోహిత్ కేవలం 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడం ద్వారా దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్‌ను సమం చేశాడు.

రోహిత్ శర్మకు మైదానంలోనే కాదు, మైదానం వెలుపల వ్యక్తిగత జీవితంలో కూడా డిసెంబర్ చాలా ప్రత్యేకమైనది. 13 డిసెంబర్ 2015న, రోహిత్ శర్మ రితికా సజ్దేను వివాహం చేసుకున్నాడు. దీంతో తన జీవితంలో కొత్త భాగాన్ని ప్రారంభించాడు. ఇది మాత్రమే కాదు, రోహిత్, రితికల కుమార్తె అదర కూడా 30 డిసెంబర్ 2018న జన్మించింది. అంటే ఓవరాల్‌గా డిసెంబర్ నెల రోహిత్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతంగా, గుర్తుండిపోయే నెలగా మారింది.





























