AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiktok Couple: ప్రకృతిని ప్రేమించే వారు కాదు.. ప్రకృతిలో మమేకమైపోయారు ఈ దంపతులు.. అదెలా సాధ్యమైందంటే..!

Tiktok Couple: ప్రకృతిని ప్రేమించే వాళ్ల గురించి తెలుసు. కానీ, ప్రకృతిలో మమేకమైపోయే వ్యక్తుల గురించి మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా?

Tiktok Couple: ప్రకృతిని ప్రేమించే వారు కాదు.. ప్రకృతిలో మమేకమైపోయారు ఈ దంపతులు.. అదెలా సాధ్యమైందంటే..!
Tiktoker Woman
Shiva Prajapati
|

Updated on: Dec 09, 2021 | 9:58 AM

Share

Tiktok Couple: ప్రకృతిని ప్రేమించే వాళ్ల గురించి తెలుసు. కానీ, ప్రకృతిలో మమేకమైపోయే వ్యక్తుల గురించి మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? కానీ, ఈ జంటను చూస్తే.. ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్లు గత కొద్ది రోజులుగా అడవుల్లో హాయిగా జీవితం గడుపుతున్నారు. అడవిలో ఓ టెంట్‌ వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంతకీ వీళ్లేవరూ.. ఎక్కడివారో ఇప్పుడు తెలుసుకుందాం..

కెనడాకు చెందిన ఎమిలీ.. తన బాయ్‌ఫ్రెండ్‌, రెండు కుక్కలతో కలిసి అడవిలోకి వెళ్లింది. అక్కడ టెంట్ వేసుకుని హాయిగా నివసిస్తోంది. కెనడాలోని ఓ అడవిలో టెంట్ వేసుకొని తన బాయ్‌ఫ్రెండ్‌, రెండు కుక్కలతో హాయిగా నివసిస్తోంది. ఇకపోతే, ఆ టెంట్‌లోపల… ఆర్‌వీ పరుపుతో చేసిన బెడ్ కూడా ఉంది. కానీ, రాత్రివేళ వీళ్లు చెట్ల కొమ్మలపై కట్టుకున్న బెడ్‌పై పడుకుంటారు. రాత్రివేళ టెంట్‌లో బెడ్ కంటే… చెట్లపై బెడ్డే సేఫ్టీ అంటున్నారు. టెంట్‌లో ఓ భారీ అద్దం, ఓ కుర్చీ, ఓ టేబుల్ కూడా ఉన్నాయి. మరోవైపు బట్టలు పెట్టుకోవటానికి సెట్ చేసుకున్నారు. టెంట్‌ లోపల ఓ ఫ్లోర్ ఏర్పాటు చేసి.. అందులో ఆహారాన్ని స్టోర్ చేసుకున్నారు. బకెట్‌ని టాయిలెట్‌లా వాడుతున్నారు. స్నానం కోసం సోలార్ పవర్‌తో పనిచేసే షవర్ బ్యాగ్ ఉంది. పైగా వీళ్లకు ఓ కారు కూడా ఉంది. అందులో మొబైల్స్ ఛార్జ్ చేసుకుంటున్నారు. ఇక వీళ్లు ఈ టెంట్‌లో ఉండే, రోజులో తక్కువ సమయం మాత్రమే..ఎక్కువ టైమ్‌ అడవిలోనే గడుపుతారు.

ఇకపోతే, ఎమిలీకి Etsy షాప్‌ ఉంది. అందులో పౌచ్‌లు తయారుచేసి అమ్ముతుంది. అలా కావాల్సిన మనీ సంపాదిస్తోంది. పైగా వీళ్లు ఈ అడవిలో ఉంటుంన్నందుకు…ఆ అడవి యజమానులకు 33వేల రూపాయలు కిరాయి కూడా చెల్లిస్తున్నారు. ఇందుకుగానూ వారికి 5 ఎకరాల అడవిని ఇచ్చారు. అక్కడ ఈ జంట మొక్కలు పెంచుతోంది. కాకపోతే, వీళ్ల లైఫ్‌స్టైల్ చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. జంతువులు, కృరమృగాల మధ్య జాగ్రత్త అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

Also read:

 Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Follow Us
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..
జుంకాల నుండి నెక్లెస్‌ల వరకు.. అత్యంత చౌకగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ
జుంకాల నుండి నెక్లెస్‌ల వరకు.. అత్యంత చౌకగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ
భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా?
ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా?
వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా?మొక్కలకు అమృతం లాంటి ఎరువు తయారీ
వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా?మొక్కలకు అమృతం లాంటి ఎరువు తయారీ
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వాన పడితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉందా ?
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వాన పడితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉందా ?