Viral Video: ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే.. ఈ వైరల్ వీడియోనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ..
Viral Video: ఒక జీవికి ఆకలేస్తే.. మరో జీవికి ఆయువు మూడినట్లే.. వినడానికి కఠువుగా ఉన్నా ఇదే నిజం, చరిత్ర మనకు చెబుతోంది కూడా ఇదే. అయితే ఏ జీవి ఆయువు మూడుతుంది.? ఏ జీవి గెలుస్తుందన్నది దాని బలంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే..
Viral Video: ఒక జీవికి ఆకలేస్తే.. మరో జీవికి ఆయువు మూడినట్లే.. వినడానికి కఠువుగా ఉన్నా ఇదే నిజం, చరిత్ర మనకు చెబుతోంది కూడా ఇదే. అయితే ఏ జీవి ఆయువు మూడుతుంది.? ఏ జీవి గెలుస్తుందన్నది దాని బలంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఆ బలం కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు మొసలి నీటి బయట ఉంటే దానికి బలం తక్కువగా ఉంటుంది. నీటిలో ఉంటే దానికి వంద ఎనుగుల బలం వస్తుంది. దున్నలకు నీటి బయట బలం.. అదే విధంగా నీటిలో ఉంటే బలం తగ్గుతుంది. మరి ఈ రెండింటి మధ్య పోరు జరిగితే ఎవరు గెలుస్తారు.? ఆ పోరు ఎంత విధ్వసకరంగా సాగుతుంది.? తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన వీడియోను చూస్తే అర్థమవుతుంది.
అటవీ ప్రాంతంలో కొన్ని అటవి దున్నలు ఓ నీటి వాగును దాటుతూ వెళుతున్నాయి. అయితే అదే సమయంలో ఆ నీటిలో ఓ మెసలి నెమ్మదిగా దున్నలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అదును చూసుకొని ఓ దున్నను అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ముందుగా ఓ దున్న మాత్రం చాకచక్యంగా తప్పించుకుంది. కానీ ఆ మొసలి ఊరుకుంటుందా… మరో దున్నను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈసారి మొసలి సక్సెస్ అయ్యింది. శరవేగంగా నీటిలో దూసుకుపోతూ దున్న మెడను ఒక్కసారిగా కరిచేసింది. వెంటనే దాన్ని బలంగా నీటిలోకి లాగేసుకుంది. దీనంతటిని అవతలి ఒడ్డున ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: India Covid Cases: దేశంలో తగ్గిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య.. 259 రోజుల కనిష్ఠ స్థాయికి..
ISRO: ఇస్రో గుడ్‌న్యూస్.. ఉచితంగా ఆన్‌లైన్ కోర్సు.. దరఖాస్తు చేసుకోండిలా..!
Winter Heart Attack: శీతాకాలంలో గుండెపోటు అధికం.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..!