India Covid Cases: దేశంలో తగ్గిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య.. 259 రోజుల కనిష్ఠ స్థాయికి..

Coronavirus India Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 10,423 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

India Covid Cases: దేశంలో తగ్గిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య.. 259 రోజుల కనిష్ఠ స్థాయికి..
covid cases
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 02, 2021 | 10:16 AM

Coronavirus India Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 10,423 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది గత 259 రోజుల్లో ఒక రోజులో నమోదైన అతి తక్కువ కేసుల సంఖ్య కావడం విశేషం. నిన్నటితో పోల్చితే కొత్త కరోనా కేసుల సంఖ్య దాదాపు 16 శాతం తగ్గింది. అయితే గత 24 గం.ల్లో కరోనా మరణాల సంఖ్య 443గా నమోదయ్యింది. కాగా గత 24 గం.ల్లో 15,021 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,26,83,581కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,53,776 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అయితే దీపావళి పండుగ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, హ్యాండ్ వాష్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో థర్డ్ వేవ్ ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు.

Also Read..

Huzurabad By Election Result: హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు ఇండిపెండెంట్స్ షాక్.. కారును పోలిన రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు

Viral News: కిలో స్వీట్ ధర రూ. 11,000.. ఏంటి బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..