Viral News: కిలో స్వీట్ ధర రూ. 11,000.. ఏంటి బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..

Viral News: దీపావళి పండుగ అంటే టపాకాయలకు ఎంతటి ముఖ్యపాత్ర ఉంటుందో స్వీట్స్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. పండుగ వేళ కచ్చితంగా స్వీట్‌ను తీసుకోవడం ఎప్పటి నుంచో వస్తోన్న ఆచారం. అయితే..

Viral News: కిలో స్వీట్ ధర రూ. 11,000.. ఏంటి బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..
Viral News
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Nov 02, 2021 | 12:11 PM

Viral News: దీపావళి పండుగ అంటే టపాకాయలకు ఎంతటి ముఖ్యపాత్ర ఉంటుందో స్వీట్స్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. పండుగ వేళ కచ్చితంగా స్వీట్‌ను తీసుకోవడం ఎప్పటి నుంచో వస్తోన్న ఆచారం. అయితే ఈ స్వీట్ అన్నింటిలా ఉంటే ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. అందుకే మహారాష్ట్రాలోని అమరావతి అనే పట్టణంలో ఓ స్వీట్‌ షాప్‌ యజమాని ప్రత్యేకమైన స్వీట్లను రూపొందించారు. వీటి విలువ కిలో అక్షరాల రూ. 11,000 ఇంతకీ ఈ ట్వీట్‌లో ఉన్న అంత ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో రఘువీర్‌ స్వీట్‌ మార్ట్‌ ప్రతీఏటా దీపావళికి ప్రత్యేకంగా స్వీట్లను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఖరీదైన స్వీట్లను తయారు చేయడం ఈ మార్ట్‌ ప్రత్యేకత. ఇందులో భాగంగానే గతేడాది ‘సోనేరి భోగ్‌’ పేరుతో కిలో రూ. 7000 విలువ చేసే స్వీట్లను తయారు చేశారు. దీంతో ఈ స్వీట్‌కు అప్పట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈసారి మరింత ఎక్కువ ధరతో స్వీట్‌ను రూపొందించారు. ఈసారి ‘సువర్ణ కలష్‌’ పేరుతో ఏకంగా కేజీ రూ. 11,000 కావడం విశేషం. ఆకర్షణీయమైన గిఫ్ట్‌ బాక్స్‌లో అందిస్తారు. ఈ స్వీట్స్‌ తయారీలో బాదం, పిస్తా, కుంకుమపువ్వు వంటి వాటిని ఉపయోగించారు.

వీటితో స్వీట్లను డెకరేషన్‌ చేయడానికి ఏకంగా బంగారంతో తయారు చేసిన ప్లేక్‌లను వాడడం విశేషం. రఘువీర్‌ స్వీట్స్‌ ప్రతీ ఏటా ఇలాగే బంగారంతో కూడిన స్వీట్లను తయారు చేస్తున్నారు. వీరి స్వీట్లకు ఒక్క అమరావతిలనే కాకుండా నాగ్‌పూర్‌, విదర్భలాంటి ప్రాంతాల్లోనూ ఫుల్‌ డిమాండ్‌ ఉంది. అంతేకాకుండా అమరావతి నుంచి ఢిల్లీ, బెంగళూరులాంటి నగరాలకు కూడా ఈ స్వీట్లు ఎగుమతి కావడం విశేషం.

Also Read: Cyber Crime: పెళ్లి సంబంధం పేరుతో టోకరా.. రూ.17.90 లక్షలు కాజేసిన వైనం..

Arvind Kejrival: మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా తీర్థయాత్రలు.. గోవా ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్‌ హామీ..

Petrol Diesel Price: ధన్‌తేరస్‌ రోజు తగ్గని పెట్రోల్ ధరలు.. మీ నగరంలో ఈ రోజు..