Arvind Kejrival: మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా తీర్థయాత్రలు.. గోవా ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్‌ హామీ..

దేశ రాజధాని నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా తమ పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇందులో భాగంగా

Arvind Kejrival: మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా తీర్థయాత్రలు.. గోవా ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్‌ హామీ..
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2021 | 9:17 AM

దేశ రాజధాని నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా తమ పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని విస్తృత ప్రణాళికలు రచిస్తున్నారు. స్వయంగా ప్రచారంలోకి దిగి అన్న వర్గాల ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గోవాలో నిర్వహించిన పలు సభల్లో పాల్గొన్న కేజ్రీవాల్‌.. రాష్ట్రంలో ఆప్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ప్రజలను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళతామని హామీ ఇచ్చారు.

ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయి.. గోవాలోని హిందువులను అయోధ్య రామాలయానికి, క్రైస్తవులను వేలాంకినికి, ముస్లింలను రాజస్థాన్‌లోని అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాకు, సాయిబాబాను కొలిచే భక్తులను షిర్డీ యాత్రకు ఉచితంగా తీసుకెళతామని ఆప్‌ అధినేత చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. గోవాలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. గోవాలోని అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షించడమే లక్ష్యంగా గతంలోనూ ఎన్నో హామీలు కురిపించారు అరవింద్‌. అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Also Read:

Diwali: ఏఏ రాష్ట్రాలు క్రాకర్స్ వినియోగానికి అనుమతి ఇచ్చాయి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి..?

Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌.. మనీలాండరింగ్‌ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం

Self Help Groups: మహిళల కోసం మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ప్రతి ఏడాది లక్ష రూపాయల సంపాదన..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?