Viral Video: వెడ్డింగ్ ఫోటోషూట్‌లో షాకింగ్ ఘటన… గాయాలతో ఆసుపత్రిపాలైన వధువు
పెళ్లంటే నూరేళ్ల పంట. దాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా.. అంగరంగ వైభవంగా చేసుకోవడంతో పాటు ఆ స్వీట్ మెమొరీస్‌ని క్షణాలను కెమెరాల్లో బంధించడానికి యువత లక్షల రూపాయలు ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు. ప్రీవెడ్డింగ్ షూట్ సంస్కృతి ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. కొందరు తమ కులవృత్తుల పనులు చేసినట్లు వీడియోలు తీసుకుంటున్నారు. పెళ్లి వేడుకను సినిమాలా కెమెరాల్లో బంధిస్తున్నారు. కొత్తగా ప్రయత్నిస్తూ ప్రీవెడ్డింగ్ వీడియోలను

పెళ్లంటే నూరేళ్ల పంట. దాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా.. అంగరంగ వైభవంగా చేసుకోవడంతో పాటు ఆ స్వీట్ మెమొరీస్‌ని క్షణాలను కెమెరాల్లో బంధించడానికి యువత లక్షల రూపాయలు ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు. ప్రీవెడ్డింగ్ షూట్ సంస్కృతి ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. కొందరు తమ కులవృత్తుల పనులు చేసినట్లు వీడియోలు తీసుకుంటున్నారు. పెళ్లి వేడుకను సినిమాలా కెమెరాల్లో బంధిస్తున్నారు. కొత్తగా ప్రయత్నిస్తూ ప్రీవెడ్డింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌గా పెట్టడానికి ఎక్కువ జంటలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఫొటోషూట్‌ల కోసం వెళ్లిన జంటలు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. నదుల్లో షూట్‌లు పెట్టుకున్నప్పుడు పడవల్లోంచి జారి నీటిలో పడుతున్నారు. జలపాతాల్లో పడి తీవ్రంగా గాయాలపాలైన ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ప్రమాదకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమ పెళ్లి కోసం కెనడా నుండి బెంగళూరుకు ప్రయాణించిన ఒక భారతీయ జంట ఫోటో షూట్ చేస్తున్న సమయంలో కలర్ బాంబును ప్లాన్ చేసుకున్నారు. అయితే వారి ప్లాన్ బెడిసికొట్టింది. సరిగ్గా సమయానికి ఆ కలర్ బాంబు పనిచేయకపోవడంతో దురదృష్టకర క్షణాన్ని ఎదుర్కొన్నారు. వధువు తీవ్రంగా గాయపడింది.
కలర్ బాంబు అనేది రంగు పొడి లేదా పొగను విడుదల చేసే ప్రత్యేక పరికరం. దీనిని తరచుగా వేడుకలు, ఫోటోషూట్‌లు వంటి ప్రత్యేక ఈవెంట్‌లలో వాడుతుంటారు. రంగురంగుల పొగతో ఉత్తేజకరమైన వాతావరణం సృష్టించడానికి ఉపయోగిస్తారు.
అయితే ఆ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన ఘటన మొత్తం వీడియో రికార్డ్ అయింది. ఫోటో కోసం వధువును వరుడు పైకి ఎత్తుతాడు. అదే సమయంలో వారి వెనకాల కలర్‌బాంబు పేలేలా ముందే ప్లాన్ చేసిపెట్టుకున్నారు. అయితే కలర్‌బాంబు నేరుగా వారిని తాకగానే అక్కడే మంటలు పుట్టాయి. వధువు వీపు వెనకాల మెరుపు లాంటి మంట కనిపించింది. దాంతో ఆమె వీపుకు గాయం అయింది. వెంట్రకల కుదుళ్లు కూడా కాలిపోయాయి. వధువును వెంటను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తన గయాలకు సంబంధించిన ఫొటోలను కూడా వధువు షేర్ చేసింది.
వీడియో చూడండి:
View this post on Instagram
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి భద్రతా చర్యలు తీసుకోవాలని చాలామంది సూచించారు. అయితే, కొంతమంది వినియోగదారులు వారి దురదృష్టకర పరిస్థితికి సానుభూతి చూపుతూ జంటకు మద్దతు తెలిపారు.