Viral Video : సంగీతానికి మూగజీవులు కూడా పరవశించాల్సిందే.. అందుకు సాక్షం ఈ వీడియోనే..
సంగీతానికి రాళ్ళూ సైతం కరుగుతాయని అంటుంటారు.. సంగీతం ప్రతి జీవిని కదిలిస్తుంది. మనసుకు హాయినిస్తుంది సంగీతం.
Viral Video: సంగీతానికి రాళ్ళూ సైతం కరుగుతాయని అంటుంటారు.. సంగీతం ప్రతి జీవిని కదిలిస్తుంది. మనసుకు హాయినిస్తుంది సంగీతం. మ్యూజిక్ ప్రతి జీవిని కదిలిస్తుంది. మంచి సంగీతం మానవులనే కాదు జంతువులను సైతం ఆకర్షిస్తుంది. ఇందుకు చాలానే ఉదాహరణలు ఉన్నాయి. జతువులు సంగీతానికి సంధించే వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. నిత్యం జతువులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. ఈ వీడియోలో సంగీతానికి నక్క స్పందించడం మనం చూడొచ్చు. కొలరాడోలోని వుడ్స్‌లో బాంజో ప్లేయర్ ఒక నక్కను తన సంగీతంతో ఆకట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ పోస్ట్ చేసిన వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఆండీ థార్న్ సుందరమైన ప్రదేశంలో తన బాంజో వాయిస్తుండగా ఊహించని సంఘటన జరిగింది. అక్కడికి అనుకోకుండా ఒక నక్క వచ్చింది. అకస్మాత్తుగా ఒక నక్క వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఆండీ సంకోచించకుండా సంగీతాన్ని కంటిన్యూ చేశాడు. ఆ నక్క శ్రద్ధగా అతడి సంగీతాన్ని వింటూ ఉండిపోయింది. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తర్వాత వీడియో 9.5 మిలియన్ల వీక్షణలను పొందింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :