AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 10 కోడి గుడ్లు మింగి.. కక్కిన ఆరడుగుల కోబ్రా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Snake Trending Video: ఇటీవల కాలంలో.. ప్రజలను ఆశ్చర్యపరిచే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి

Viral Video: 10 కోడి గుడ్లు మింగి.. కక్కిన ఆరడుగుల కోబ్రా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Cobra Snake
Shaik Madar Saheb
|

Updated on: Jun 30, 2021 | 10:34 AM

Share

Snake Trending Video: ఇటీవల కాలంలో.. ప్రజలను ఆశ్చర్యపరిచే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి ఇలాంటి వీడియోనే వెలుగులోకి వచ్చింది. ఓ త్రాచుపాము పది గుడ్లను మింగి.. మళ్లీ ఆ గుడ్లను బయటకు కక్కింది. ఈ షాకింగ్ వీడియో.. మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందినదని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని కోశాంబి గ్రామంలో నివసిస్తున్న పవన్ లోన్బుల్ నివాసంలోకి త్రాచుపాము రాత్రి వేళ ప్రవేశించింది. అనంతరం అక్కడ ఉన్న కోడి గుడ్లను మింగింది. ఆపై సతమతమవుతూ.. బుసలు కొడుతూ.. కోడి దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలో శబ్ధం విని బయటకు వచ్చిన కుటుంబం.. ఆ పామును చూసి భయంతో పరుగులు తీసింది. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారమివ్వగా అతను వచ్చి పామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో మింగిన గుడ్లను కక్కడం ప్రారంభించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వామ్మో ఈ పాము అన్ని గుడ్లు ఎలా తిని.. కక్కిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

వీడియో చూడండి..

పవన్ లోన్బుల్ ఇంట్లోకి రాత్రి 9 గంటల సమయంలో నాగుపాము ప్రవేశించి.. కోడి పొదుగుతున్న గుడ్ల దగ్గరకు వెళ్లింది. గుడ్లను తిన్న అనంతరం కోడిపై కన్నెసి బుసలు కొట్టింది.. ఈ క్రమంలో కోడి అరుపులు విని బయటకు వచ్చినట్లు పవన్ కుటుంబీకులు పేర్కొన్నారు. దానిని చూసి భయంతో పరుగులు తీశామని పేర్కొన్నారు. ఈ ఘటనలో కోడికి ప్రాణహాని తప్పింది. సుమారు 6 అడుగుల పొడవు ఉన్న ఈ కోబ్రా.. ఆకలితో గుడ్లు తిని ఉంటుందని స్నేక్ క్యాచర్ పేర్కొన్నాడు. పట్టుకున్న అనంతరం పామును అడవిలో విడిచిపెట్టారు.

Also Read:

Drones Jammu and Kashmir: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం.. అప్రమత్తమైన భద్రతా బలగాలు..

Balakrishna : బాలయ్య బాబు కోసం అదిరిపోయే కథను సిద్దమా చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు