AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదెక్కడి సీన్ గురూ..! రిమోట్‌తో కంట్రోల్ చేస్తూ డ్రోన్‌ను ఎగరేస్తున్న చింపాంజీలు! వీడియో వైరల్

Chimpanzee Flying drone: కోతులు, చింపాజీల వ్యవహారశైలి అచ్చం మనలాగే ఉంటుంది. వాటి ప్రవర్తన, చేష్టలు నిశితంగా పరిశీలిస్తే కొతి నుంచే.. మానవులు రూపాంతరం

Viral Video: ఇదెక్కడి సీన్ గురూ..! రిమోట్‌తో కంట్రోల్ చేస్తూ డ్రోన్‌ను ఎగరేస్తున్న చింపాంజీలు! వీడియో వైరల్
Chimpanzee
Shaik Madar Saheb
|

Updated on: Nov 16, 2021 | 5:52 PM

Share

Chimpanzee Flying drone: కోతులు, చింపాజీల వ్యవహారశైలి అచ్చం మనలాగే ఉంటుంది. వాటి ప్రవర్తన, చేష్టలు నిశితంగా పరిశీలిస్తే కొతి నుంచే.. మానవులు రూపాంతరం చెందినట్లు అధ్యయనాల్లో సైతం తేలింది. దీనిని రుజువు చేసే చాలా వీడియోలను మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం.. ప్రస్తుతం చింపాంజీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది దాని తెలివితేటలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. చింపాంజీలకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తే.. ఇవి కోతుల జాతిలో అత్యంత తెలివైనదని రుజువు చేస్తుంది. ఇటీవల చింపాంజీ దుస్తులు ఉతుకుతున్న వీడియో, మనషులతో ఆడుకుంటున్న వీడియోలను మనం చూసే ఉంటాం.. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ వీడియో క్లిప్‌లో.. రెండు చింపాంజీలు డ్రోన్‌ను ఎగురుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒక చింపాజీ రిమోట్ పట్టుకుని ఉండగా, మరొక చింపాజీ డ్రోన్‌ ఎగురుతున్న దృశ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా.. ఉంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి చూడలేదంటూ ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు పలు రకకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

చింపాంజీ డ్రోన్‌ని ప్రొఫెషనల్‌గా ఎగరవేయడమే కాకుండా రిమోట్‌ను చాలా సులభంగా కంట్రోల్ చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే, ఈ వీడియో ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఒక చింపాజీ డ్రోన్‌ను ఎగురవేయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

వీడియో..

ఈ ఫన్నీ వీడియోను వైల్డ్‌సాఫ్ట్‌ప్లానెట్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా షేర్ చేసింది. దీనిని వేలాది మంది వీక్షించి.. పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఒక వినియోగదారుపై వ్యాఖ్యానిస్తూ.. ఇది అద్భుతమైన దృశ్యం అని రాశారు. చింపాంజీ చాలా తెలివైనదని.. అది ఒక ప్రొఫేషనల్ లాగా కనిపిస్తుందంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Video Viral: మొసలిని కౌగిలించుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Viral Video: అమ్మబాబోయ్.! భయంకర సాలీడుగా మారిన శునకం.. కుక్కను చూసి బెదిరిపోతున్న జనం.. వైరల్ వీడియో!