Video Viral: కటౌట్లు చూసి కొన్ని కొన్ని నమ్మొయ్యొద్దు డ్యూడ్.. ఈ బుడ్డోడు కూతకు వచ్చిన ఆటగాడ్ని ఇట్టే పట్టేశాడు..

భారతదేశంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నాయి. క్రికెట్ ను ఆరాధిస్తున్నప్పటికీ.. ఖోఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకూ విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎంతో మంది క్రీడాకారులు..

Video Viral: కటౌట్లు చూసి కొన్ని కొన్ని నమ్మొయ్యొద్దు డ్యూడ్.. ఈ బుడ్డోడు కూతకు వచ్చిన ఆటగాడ్ని ఇట్టే పట్టేశాడు..
Child Playing Video
Ganesh Mudavath

|

Sep 19, 2022 | 9:40 PM

భారతదేశంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నాయి. క్రికెట్ ను ఆరాధిస్తున్నప్పటికీ.. ఖోఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకూ విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎంతో మంది క్రీడాకారులు ఆటల్లో శిఖరాలను అధిరోహిస్తూ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారు. మువ్వన్నెల జెండాను అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడిస్తున్నారు. క్రీడల్లో విజయం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అందుకు చాలా కష్టపడాలి. చిన్నప్పటి నుంచే ఆటలపై ఇష్టం పెంచుకోవాలి. రేయింబవళ్లు కష్టపడాలి. ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొ్ంటూ ముందడుగు వేస్తేనే విజయం సాధించగలం. మొక్కై వంగనిదే మానై వంగునా అనే సామెతను అక్షరాలా నిజం చేస్తోంది ఈ వీడియో. సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు ఉన్నాయి. ప్రజల్లో ఉన్న ట్యాలెంట్ ను బయటకు తీసుకువచ్చేందుకు చక్కని వేదికగా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. దీని ద్వారా ఎంతో మంది సామాన్యులు ఒక్క రోజులోనే ఫేమస్ అయిపోయారు. అయితే క్రీడలకు సంబంధిన స్కిల్స్ చాలా మందిలో ఉంటాయి. సరైన సమయంలో మాత్రమే అవి బయటపడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ వీడియోలో కొందరు చిన్నారులు కబడ్డీ ఆడుతుండటాన్ని చూడవచ్చు. వారితో పోలిస్తే మరో చిన్నారి కూడా ఈ క్లిప్ లో కనిపిస్తాడు. అతను కూడా తోటి వారితో కలిసి ఆడుతాడు. ప్రత్యర్థి కూతకు వచ్చినపప్పుడు ఆ చిన్నారి వెంటనే అలర్ట్ అయ్యి.. అతని కాళ్లు పట్టుకుని లాగాడు. దీంతో అతను అవతలి వైపుకు వెళ్లలేక చిక్కుకుపోతాడు. ఆ తర్వాత జట్టుసభ్యులందరూ వచ్చి అతనిని కింద పడేసి పాయింట్ సాధిస్తారు. అయితే ప్రత్యర్థిని పట్టుకున్న చిన్నారి.. మిగతా వారితో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉన్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత, కచ్చితంగా పిల్లల ధైర్యానికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది.

ఈ అద్భుతమైన వీడియోను ఐపీఎస్ అధికారి ప్రహ్లాద్ మీనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘వయస్సు ద్వారా కాదు, ఒక వ్యక్తి తన విశ్వాసం, దృఢ సంకల్పం, ఉన్నత స్ఫూర్తితో అతి పెద్ద కష్టాన్ని అధిగమించగలడు’ అనే క్యాప్షన్‌ కు రాశారు. ఈ క్లిప్ కేవలం 30 సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్య, 57 వేలకు పైగా లైక్స్ వస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైన వీడియో అని నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu