Uttar-pradesh: బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం.. రూ.42 లక్షలు నీళ్లపాలు.. అసలేం జరిగిందంటే..

బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం..పెద్ద విపత్తుకు దారితీసింది. అయితే బ్యాంక్ అధికారులు తెలివిగా విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

Uttar-pradesh: బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం.. రూ.42 లక్షలు నీళ్లపాలు.. అసలేం జరిగిందంటే..
Currency Notes
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2022 | 9:50 PM

Uttar-pradesh: దాచిన సొమ్ము దెయ్యాల పాలు అనేడి నానుడి… కానీ, ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం..పెద్ద విపత్తుకు దారితీసింది. ఒకటి కాదు రెండు కాదు.. అధికారుల నిర్లక్ష్యం ఏకంగా రూ. 42లక్షలు నగదు నీటి పాలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)లో చోటు చేసుకుంది. పాండు నగర్ బ్రాంచ్‌లో కరెన్సీ చెస్ట్‌లో నీరు చేరడంతో రూ. 42 లక్షల కరెన్సీ నోట్లు తడిసిపోయాయి. అయితే బ్యాంక్ అధికారులు తెలివిగా విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. జూలై నెలాఖరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బృందం బ్యాంక్ కరెన్సీ చెస్ట్‌ను ఆడిట్ చేసినప్పుడు బ్యాంకు అధికారుల పనితీరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సీనియర్ మేనేజర్ కరెన్సీ చెస్ట్ దేవి శంకర్ సహా నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని పాండునగర్ బ్రాంచ్‌లోనే ప్రధాన కరెన్సీ చెస్ట్ ఉంది. ప్రధాన కరెన్సీ బాక్స్ రెండు రెట్లు ఎక్కువ సామర్థ్యంతో నిండి ఉంటుంది. నగదు నిల్వకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా తెలిసింది. జూలై 25 నుండి జూలై 29 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రధాన కరెన్సీ ఆడిట్ నిర్వహించారు. ఆడిట్‌లో ఆర్‌బీఐ అధికారులు నీళ్లలో తడిచి ముద్దైపోయిన నోట్లను గుర్తించారు. విచారణలో నేలపై ఉంచిన పెట్టెలోకి నీరు చేరిందని, తేమ కారణంగా దిగువన ఉంచిన నోట్లు కుళ్లిపోయాయని తేలింది.

బహుశా రూ.2 లక్షల నోట్లు కుళ్లిపోయి ఉంటాయని తొలుత ఆర్బీఐ అధికారులు భావించగా.. వారంరోజుల పాటు ఆ నోట్లను లెక్కించే సరికి ఆ సంఖ్య రూ.42 లక్షలకు చేరింది. ఇది చూసి ఆర్బీఐ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు కరెన్సీ చెస్ట్ విభాగం అధిపతి నిధి పాఠక్ తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తుది చర్యలు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

సస్పెండ్ అయిన వారిలో కరెన్సీ చెస్ట్ సీనియర్ మేనేజర్ దేవి శంకర్, మేనేజర్ ఆశారాం, చెస్ట్ ఆఫీసర్ రాకేష్ కుమార్, సీనియర్ మేనేజర్ భాస్కర్ కుమార్ భార్గవ ఉన్నారు. వీరిలో ముగ్గురు అధికారులను నోట్లు తడిసిన తర్వాత ప్రధాన కరెన్సీ చెస్ట్‌లో ఉంచినట్లు సమాచారం. ఆర్‌బీఐ వర్గాల ప్రకారం, కరెన్సీ చెస్ట్‌లను ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ ఆడిట్ చేస్తుంది. ఇందుకోసం కొన్ని నిబంధనలను రూపొందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!