వర్షం (Rain) అంటే మనందరికీ చాలా ఇష్టం. వానలో తడవాలని, కేరింతలు కొట్టాలని అనుకుంటుంటాం. కానీ జలుబు చేస్తుందనో, జ్వరం వస్తోందన్న భయంతో వర్షంలోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తాం. అయితే బాల్యంలో వర్షం కురుస్తున్న....
వర్షం (Rain) అంటే మనందరికీ చాలా ఇష్టం. వానలో తడవాలని, కేరింతలు కొట్టాలని అనుకుంటుంటాం. కానీ జలుబు చేస్తుందనో, జ్వరం వస్తోందన్న భయంతో వర్షంలోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తాం. అయితే బాల్యంలో వర్షం కురుస్తున్న సమయంలో తడుస్తూ ఎంజాయ్ చేసిన ఘటనను అంత ఈజీగా మర్చిపోలేం. ఆ మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా తెలియని అనుభూతికి లోనవుతాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ బాల్యం కచ్చితంగా గుర్తుకు వస్తుంది. వైరల్‌గా మారిన ఈ క్లిప్ కొన్ని సెకన్లే ఉన్నప్పటికీ.. ఆ చిన్నారి తన ఆనందంతో నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో వర్షం కురుస్తున్న ఆనందంలో ఒక చిన్న పిల్లవాడు ఆనందించడాన్ని చూడవచ్చు. అతనిపై వర్షపు చినుకులు పడుతుండగా వాటిని ఆనందంగా ఆస్వాదిస్తాడు. రోడ్డుపై హాయిగా కూర్చొని వానలో కేరింతలు కొడతాడు.
ఈ అందమైన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘దీన్నే నిజమైన ఆనందం అంటారు’ అని క్యాప్షన్ ఇచ్చారు. వైరల్ క్లిప్ కేవలం 8 సెకన్లు, కానీ సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా చాలా మంది వీడియోను లైక్ చేస్తున్నారు. వర్షంలో తడవడం ఎవరికి ఇష్టం ఉండదని తమదైన శైలిలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.