Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ద్యావుడా.. మిగిలిన బిర్యానీతో కేక్ చేసిన చెఫ్.. వీడియో చూసి బిర్యానీ ప్రియులు షాక్..

ప్రస్తుతం ఒక చెఫ్ వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన భోజన ప్రియులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆ చెఫ్ మిగిలిపోయిన బిర్యానీతో కేక్ తయారు చేశాడు. అయితే ఈ చెఫ్ తక్కువ వస్తువులతో కూడా మంచి ఆహారాన్ని తయారు చేసే రేసిపీలను ప్రజలకు పరిచయం చేసే కళాత్మకతతో ప్రసిద్ధి చెందాడు ఈ చెఫ్.. అయితే ఇప్పుడు చెఫ్ కు సంబంధించిన తాజా వీడియో చూసి షాక్ తింటున్నారు. అందులో అతను మిగిలిపోయిన బిర్యానీతో కేక్ తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచాడు.

Viral Video: ద్యావుడా.. మిగిలిన బిర్యానీతో కేక్ చేసిన చెఫ్.. వీడియో చూసి బిర్యానీ ప్రియులు షాక్..
Biryani Cake,
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2025 | 1:23 PM

ఆహార ప్రయోగాల పేరుతో.. ప్రజలు ఎటువంటి వంటకాలను అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని రకాల వంటల తయారీ చూస్తే చాలు వంతులు వస్తాయా అనిపిస్తుంది కొందరికి. కొత్త వంటకాలు తయారు చేస్తూ వంటలపై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫుడ్ కి సంబంధించిన వీడియో చూసి ఆహార ప్రియులు షాక్ తింటున్నారు. ఇదేమి ఆహార ప్రయోగాలురా బాబు అంటూ ఆక్రోశిస్తున్నారు. ఆ ఆహార పదార్ధాన్ని తినడానికి ఇష్టపడం అన్న మాట అటుంచి.. కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ వీడియోలో చెఫ్ బిర్యానీతో కేక్ తయారు చేశాడు.

మిగలిన బిర్యానీ వృధా కాకుండా చేయడానికి ఒక ప్రముఖ చెఫ్ .. బిర్యానీతో కేక్‌ని తయారు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కేక్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అయితే దీనిని ఎవరు తింటారనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఈ కేక్ చూసిన తర్వాత బిర్యానీ ప్రియుల కోపం ఆకాశాన్ని తాకింది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

View this post on Instagram

A post shared by Josh Elkin (@thejoshelkin)

వీడియోలో చెఫ్ మిగిలిపోయిన బిర్యానీని వేర్వేరుగా కేక్ పొరలలో అమర్చడాన్ని మీరు చూడవచ్చు. దీని తరువాత బిర్యానీని కేక్ అచ్చులో నొక్కి, పైన పెరుగు, పుదీనా చట్నీ వేసి… దాని పైన ఒక ప్రత్యేక పొరను ఏర్పాటు చేశాడు. చూడడానికి ఇది సరిగ్గా కేక్ లాగా కనిపిస్తుంది. చివరగా కేక్ డెకరేషన్ గా కారంగా ఉండే మాంసం ముక్కలను ఉంచి అలంకరించాడు చెఫ్.

ఈ వీడియో thejoshelkin అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు లక్షలాది మంది చూశారు. ఈ కేక్ ని చూసి బిర్యానీ ప్రియులు ఈ వంటకాన్ని వ్యతిరేకించాలా లేక ప్రశంసించాలా అని అయోమయంలో పడ్డారు… ఈ బిర్యానీ రుచి ఎలా ఉన్నా, ఇది చాలా బాగుంది అని ఒక యూజర్ రాశారు. మరొకరు ఈ కేకు బిర్యానీ ప్రియులకు ఒక పీడకల లాంటిది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు ఆహారాన్ని వృధా చేయకూడదని నేను అంగీకరిస్తున్నాను అయితే ఇలాంటి సరికొత్త ప్రయోగాలను మాత్రం అంగీకరించను అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు.. ఇలా చేయండి..
ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు.. ఇలా చేయండి..
ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చేరిన ప్రధాని మోడీ..
ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చేరిన ప్రధాని మోడీ..