AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL ఫీవర్‌.. జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే

జియో కంపెనీ ఐపీఎల్ 2025 సీజన్‌ను పురస్కరించుకొని క్రికెట్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. రూ.299 రీఛార్జ్‌తో 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను 4Kలో స్ట్రీమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, 50 రోజుల జియోఫైబర్/జియోఎయిర్ ట్రయల్, 800+ టీవీ ఛానెల్స్, 11+ OTT యాప్‌లు కూడా లభిస్తాయి. ఈ లిమిటెడ్ టైం ఆఫర్ మార్చి 17 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

IPL ఫీవర్‌.. జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే
Jio Ipl 299 Pack
SN Pasha
|

Updated on: Mar 17, 2025 | 1:45 PM

Share

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమ తమ అభిమాన టీమ్స్‌లో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయ్‌? ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఎలా ఉండబోతుంది అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో జియో క్రికెట్‌ అభిమానుల కోసం అదిరిపోయే ప్లాన్‌ తీసుకొచ్చింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లోనే లైవ్‌ స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కస్టమర్ల కోసం ప్రత్యేకమైన అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది జియో.

ఈ పరిమిత కాల ఆఫర్ మార్చి 17 నుంచి మార్చి 31 మధ్య అందుబాటులో ఉంటుంది. కేవలం రూ.299 రీఛార్జ్‌తో ఈ ప్లాన్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌తో, క్రికెట్ అభిమానులు టీవీ, మొబైల్‌లో 4Kలో 90 రోజుల ఉచిత జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. అలాగే 800+ టీవీ ఛానెల్‌లు, 11+ OTT యాప్‌లు, అపరిమిత వైఫై, 4K స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించే జియోఫైబర్ లేదా జియోఎయిర్ ఫైబర్ 50 రోజుల ఉచిత ట్రయల్‌ను అనుభవించవచ్చు. ప్రస్తుత జియో వినియోగదారులు ₹299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న వారు ₹100 యాడ్-ఆన్ ప్యాక్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త వినియోగదారులు అదే ₹299 ప్లాన్‌తో జియో సిమ్‌ను పొందవచ్చు, ఈ ప్రయోజనాలన్నింటినీ ఆస్వాదించవచ్చు. ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌తో సమానంగా మార్చి 22, 2025 నుండి జియో హాట్‌స్టార్ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. మరిన్ని వివరాల కోసం సమీపంలోని జియో స్టోర్‌ను సందర్శించవచ్చు లేదా jio.comలో చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఒక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..