Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weird Taxes: ఆవు త్రేన్పు నుంచి మూత్రంపై పన్ను వరకూ .. ప్రపంచంలో వింత పన్నులు.. ఎక్కడంటే

కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.75,000కి ప్రభుత్వం పెంచింది. ఈ సందర్భంగా ఈ రోజు అలాంటి కొన్ని పన్నుల గురించి తెలుసుకుందాం.. వాటి గురించి మీరు చాలా అరుదుగా వినవచ్చు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వింత పన్నులు విధించబడ్డాయి. ఇది కొన్నిసార్లు హాస్యాస్పదంగా అనిపించవచ్చు.. అయితే అలాంటి పన్నుల వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

Weird Taxes: ఆవు త్రేన్పు నుంచి మూత్రంపై పన్ను వరకూ .. ప్రపంచంలో వింత పన్నులు.. ఎక్కడంటే
Weird Taxes In World
Follow us
Surya Kala

|

Updated on: Jul 23, 2024 | 4:21 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో మిడిల్ క్లాస్ వారు కూడా ఊహించిన విధంగా గిఫ్ట్ ఇచ్చారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.75,000కి ప్రభుత్వం పెంచింది. ఈ సందర్భంగా ఈ రోజు అలాంటి కొన్ని పన్నుల గురించి తెలుసుకుందాం.. వాటి గురించి మీరు చాలా అరుదుగా వినవచ్చు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వింత పన్నులు విధించబడ్డాయి. ఇది కొన్నిసార్లు హాస్యాస్పదంగా అనిపించవచ్చు.. అయితే అలాంటి పన్నుల వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

ఆవు త్రేనుపుపై పన్ను డెన్మార్క్, ఇతర యూరోపియన్ దేశాలలో ఆవులు గ్యాస్ విడుదల చేయడం, ఆవుల త్రేనుపుపై కూడా పన్ను వసూలు చేస్తారు. ఇలా అవులపై పన్నులు విధించడానికి కారణం గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవాలనే లక్ష్యం అని తెలుస్తుంది.

గడ్డం పన్ను 1705లో రష్యన్ పాలకుడు పీటర్ ది గ్రేట్ గడ్డాలపై పన్ను విధించాడు. తద్వారా సమాజం యూరోపియన్ దేశాల సమాజాల వలె ఆధునికంగా మారుతుంది. గడ్డం పన్ను చెల్లించిన వారు టోకెన్‌ను అందుకునేవారు. వారు ఎల్లప్పుడూ ఈ టోకెన్ ను తమ వెంట తీసుకెళ్లాలి.

ఇవి కూడా చదవండి

కిటికీలకు పన్ను 1696లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియం III కిటికీలపై పన్ను విధించాడు. ఇందులో భాగంగా ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే అంత పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ పన్ను నుంచి బయటపడడానికి ప్రజలు తమ ఇళ్లలో తక్కువ కిటికీలను ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఇది ఆరోగ్య సమస్యలకు దారితీసింది. అయితే తర్వాత కిటికీలకు పన్ను రద్దు చేయబడింది.

మూత్రంపై పన్ను రోమన్ రాజు వెస్పాసియన్ పబ్లిక్ యూరినల్స్‌పై పన్నును ప్రవేశపెట్టాడు. పరిశ్రమలో ఉపయోగించడం కోసం మూత్రాన్ని విక్రయించడం ద్వారా ఆదాయాన్ని కూడా సేకరించాడు. దీనికి కారణం మూత్రంలో అమ్మోనియాని వినియోగించేవారు. అంటే క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో మూత్రం సేకరణ, వినియోగం రెండింటిపై ఈ పన్ను ఉండేది. ఆ తర్వాత ఇది రద్దయింది

ప్లే కార్డులపై పన్ను అమెరికాలోని అలబామాలో ప్లే కార్డులను అమ్మడం లేదా కొనడంపై పన్ను విధించబడుతుంది. ఇది మాత్రమే కాదు ప్లేయింగ్ కార్డ్‌లను విక్రయించడానికి సంవత్సరానికి $3లు చెల్లించి లైసెన్స్ కూడా పొందాల్సిన అవసరం ఉంది.

అధిక ధూమపానంపై పన్ను ఆర్థిక సంక్షోభం సమయంలో చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని స్థానిక పరిపాలన మరింత ఆదాయాన్ని పెంచడానికి, స్థానిక తయారీదారులను ప్రోత్సహించడానికి బహిరంగ సిగరెట్ ధూమపానంపై పన్ను విధించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..