AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న ఈ క్రికెటర్ భార్య పారిస్ ఒలింపిక్స్‌కు దూరం.. రీజన్ ఏమిటంటే?

ఒకే ప్రదేశంలో ఉద్యోగం చేసే వారు, ఓకే జోనర్ లో ఉండే స్త్రీ, పురుషుల మధ్య పరిచయం స్నేహంగా ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న సంఘటలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ నటులు, క్రీడాకారుల మధ్య ఇటువంటి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి జంటల్లో ఒకటి మాథ్యూ షార్ట్ మాడిసన్ విల్సన్ లు. మాథ్యూ షార్ట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ కాగా భార్య మాడిసన్ విల్సన్ ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్. అంతేకాదు ఆమె ఒలింపిక్స్ లో ఇప్పటికే రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది కూడా.. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ భార్య ఒలింపిక్స్‌లో 2 స్వర్ణాలు గెలుచుకుంది. టోక్యో లో జరిగిన ఒలింపిక్స్‌లో కూడా స్వర్ణం గెలిచిన మాడిసన్ విల్సన్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌కు దూరంగా ఉంది.

Surya Kala
|

Updated on: Jul 23, 2024 | 3:33 PM

Share
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాథ్యూ షార్ట్ ప్రముఖ T20 క్రికెటర్. గత సీజన్‌లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున కూడా ఆడాడు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌లోనూ పాల్గొన్నాడు.  అయితే మాథ్యూ షార్ట్ నిజ జీవితంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతని భార్య ఒలింపిక్ బంగారు పతక విజేత. అది కూడా రెండు సార్లు గోల్డ్ మెడల్స్ ను అందుకుంది. (photo -instagram)

1 / 5
మాథ్యూ షార్ట్ భార్య పేరు మాడిసన్ విల్సన్. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ స్విమ్మర్. విల్సన్ రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు (photo -instagram)

2 / 5
బ్యాక్‌స్ట్రోక్ ,  ఫ్రీస్టైల్‌లో నైపుణ్యం కలిగిన మాడిసన్ విల్సన్ రియో​ఒలింపిక్స్ లో స్వర్ణం, రజత పతకాలను గెలుచుకుంది. (photo -instagram)

3 / 5
టోక్యో ఒలింపిక్స్‌లో టీమ్ ఈవెంట్‌లో మాడిసన్ విల్సన్ స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకుంది. అయితే మాడిసన్ జూన్ 26 నుంచి పారిస్ లో జరగనున్న వేసవి ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు (photo -instagram)

4 / 5
పారిస్ ఒలింపిక్స్‌లో మాడిసన్ ఆడకపోవడానికి కారణం చాలా ప్రత్యేకమైనది. మాడిసన్ గర్భవతి.. ఆమె త్వరలో తల్లి కాబోతోంది. అందుకనే వరసగా ఒలింపిక్స్ లో పతకం సంపాదించే అరుదైన అవకాశానికి దూరంగా ఉండి ... మాతృత్వం ఆనందాన్ని అందుకోవడానికి ఎదురుచూస్తోంది. (photo -instagram)

5 / 5