Kamika Ekadashi: కామిక ఏకాదశి రోజున ఏర్పడనున్న 3 యాదృచ్ఛికాలు.. కన్నయ్యను ఇలా పూజిస్తే సుఖ సంతోషాలు మీ సొంతం

కామికా ఏకాదశి వ్రత మహిమ గురించి పురాణ గ్రంథాలలో ఉంది. ఏకాదశి వ్రతం వల్ల తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అదే సమయంలో సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయి. అందుచేత వైష్ణవ సమాజానికి చెందిన వారు ఆచారాల ప్రకారం ఏకాదశి తిథి నాడు లోక సంరక్షకుడైన శ్రీమహావిష్ణువును పూజిస్తారు.

Kamika Ekadashi: కామిక ఏకాదశి రోజున ఏర్పడనున్న 3 యాదృచ్ఛికాలు.. కన్నయ్యను ఇలా పూజిస్తే సుఖ సంతోషాలు మీ సొంతం
Kamika Ekadashi 2024
Follow us

|

Updated on: Jul 23, 2024 | 3:59 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు ,సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పుజిస్తారు. ఏకాదశి సందర్భంగా ఉపవాసం చేస్తారు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. భక్తులు స్నానం చేసిన అనంతరం ధ్యానం చేస్తారు. ఆచారాలతో లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం దీక్ష చేపడతారు.

కామికా ఏకాదశి వ్రత మహిమ గురించి పురాణ గ్రంథాలలో ఉంది. ఏకాదశి వ్రతం వల్ల తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అదే సమయంలో సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయి. అందుచేత వైష్ణవ సమాజానికి చెందిన వారు ఆచారాల ప్రకారం ఏకాదశి తిథి నాడు లోక సంరక్షకుడైన శ్రీమహావిష్ణువును పూజిస్తారు.

పంచాంగం ప్రకారం ఆషాడ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి జూలై 30 సాయంత్రం 04:44 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై 31 మధ్యాహ్నం 03:55 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయతిథి ప్రకారం జూలై 31న కామికా ఏకాదశి జరుపుకుంటారు. దీని ప్రభావం రోజంతా ఉంటుంది. ఉపవాసం పాటించే వ్యక్తులు మర్నాడు అంటే ఆగష్టు 1వ తేదీన పారాయణం చేయవచ్చు. దీనికి ముహూర్తం ఉదయం 05:43 నుంచి 08:24 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏకాదశి రోజున ఏర్పడనున్న ప్రత్యేక యాదృచ్ఛికాలు

కామిక ఏకాదశి నాడు ధృవ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం మధ్యాహ్నం 02:14 గంటల వరకు ఉంటుంది. జ్యోతిష్యులు ధృవ యోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగంలో శ్రీ హరివిష్ణువును ఆరాధించడం ద్వారా సాధకులు కోరుకున్న ఫలితాలను పొందుతారు. శుభ కార్యాలలో కూడా విజయం సాధిస్తారు. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగ యాదృచ్ఛికం కూడా ఏర్పడనుంది. సర్వార్థ సిద్ధి యోగం రోజంతా ఉంటుంది.

శివ్వాస యోగం

కామిక ఏకాదశి రోజున మహాదేవుడు శివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉంటాడు. ఈ సమయంలో పరమశివుని ప్రతిష్ఠించి పూజించడం ద్వారా సాధకుడు అన్ని రకాల ఆనందాలను పొందుతాడు. పరమశివుడు మధ్యాహ్నం 03:55 వరకు కైలాసంపై ఉంటాడు. దీని తర్వాత నందిపై విహరిస్తాడని విశ్వాసం. రెండు సమయాలు అభిషేకానికి అనుకూలం. ఈ సమయంలో నారాయణుడిని పూజించిన భక్తులు సుఖ సంతోషాలతో జీవిస్తారు.

కామికా ఏకాదశి పూజా విధానం

  1. కామిక ఏకాదశి రోజున ఉదయం వేళ శ్రీ మహా విష్ణువు అవతారమైన కృష్ణ అవతారాన్ని పూజించండి.
  2. కన్నయ్యకు పసుపు పువ్వులు, పంచామృతం , తులసి దళాలను సమర్పించండి. పండ్లు కూడా సమర్పించవచ్చు.
  3. శ్రీకృష్ణుని ధ్యానించండి. అతని మంత్రాలను జపించండి. ఈ రోజు కూడా శివునికి జలంతో అభిషేకం చేయండి.
  4. సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం కూడా శుభప్రదం.
  5. ఈ రోజున ఉపవాసం చేసి.. పండ్లను తినడం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
  6. ఆహారం తినవలసి వస్తే సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. ఈ రోజున మీ మనస్సును భగవంతునిపై కేంద్రీకరించండి.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

కామికా ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈ రోజున ఇంట్లో ఉల్లి-వెల్లుల్లి, తామసిక ఆహారానికి దూరంగా ఉండండి. ఏకాదశి పూజ సమయంలో కుటుంబంలో అన్ని విధాలుగా శాంతియుత వాతా వరణం ఉండేలా చూసుకోండి. ఇంటికి వచ్చిన వారిని అవమానించవద్దు. పెద్దలను గౌరవించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

కామికఏకాదశిరోజున ఏర్పడనున్న 3యాదృచ్ఛికాలు శ్రీహరిని ఇలా పూజించండి
కామికఏకాదశిరోజున ఏర్పడనున్న 3యాదృచ్ఛికాలు శ్రీహరిని ఇలా పూజించండి
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్.. క్యూట్ గా మెప్పిస్తున్న అదితి రావు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్.. క్యూట్ గా మెప్పిస్తున్న అదితి రావు
నెలకు రూ. 37తో రూ. 2లక్షల బీమా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
నెలకు రూ. 37తో రూ. 2లక్షల బీమా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
నచ్చకపోయినా హీరోయిన్‌తో అలాంటి సీన్ చేశా..
నచ్చకపోయినా హీరోయిన్‌తో అలాంటి సీన్ చేశా..
ఒలింపిక్స్‌లో 2స్వర్ణాలు గెలుచుకున్న ఈక్రికెటర్ భార్య ఎవరో తెలుసా
ఒలింపిక్స్‌లో 2స్వర్ణాలు గెలుచుకున్న ఈక్రికెటర్ భార్య ఎవరో తెలుసా
కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగాలకు పెద్దపీట
కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగాలకు పెద్దపీట
మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్‌ విలన్‌ ఆఫ్‌ సౌత్‌.. ఇప్పుడు నానితో..
మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్‌ విలన్‌ ఆఫ్‌ సౌత్‌.. ఇప్పుడు నానితో..
నిర్మలమ్మ పద్దులో తీపి కబురు.. వాహనదారులకు శుభవార్త..అదేంటంటే!
నిర్మలమ్మ పద్దులో తీపి కబురు.. వాహనదారులకు శుభవార్త..అదేంటంటే!
గేమింగ్ ప్రియుల కోసం బెస్ట్ మానిటర్లు ఇవే.. అతి తక్కువ ధరలోనే..
గేమింగ్ ప్రియుల కోసం బెస్ట్ మానిటర్లు ఇవే.. అతి తక్కువ ధరలోనే..
బిర్యానీలో వేసే జాజికాయతో కీళ్ల నొప్పులు, నిద్ర సమస్యలు మాయం..
బిర్యానీలో వేసే జాజికాయతో కీళ్ల నొప్పులు, నిద్ర సమస్యలు మాయం..