Viral Photo: మీ మెడదుకు మేత వేయండి.. ఫోటోలో చిరుతను గుర్తించండి.!
Viral Video: ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. కరోనా పుణ్యమా అని జనాలు తమ బోర్‌డమ్ పోగొట్టుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో..

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. కరోనా పుణ్యమా అని జనాలు తమ బోర్‌డమ్ పోగొట్టుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారు. కొంతమంది అయితే తమ మెదడు మేత వేస్తూ.. కళ్లకు పదును పెడుతూ కష్టతరమైన పజిల్స్‌ను సాల్వ్ చేస్తూ తమ సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.
”ఆ ఫోటోలో ఏదో జంతువు”.. ”ఈ ఫోటోలో మొసలిని కనిపెట్టండి” అంటూ సాగే చిత్ర విచిత్రమైన పజిల్స్‌ను స్పందన విపరీతంగా ఉంటుంది. ఆ కోవకు చెందిన ఓ పజిల్ గురించి ఇప్పుడు చూద్దాం.. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి కొండ ప్రాంతంగా ఉన్న ఆ చోట చిరుత నక్కింది. ఆ కొండ రంగు, చిరుత శరీరం రంగు ఒకటి కావడంతో కొంచెం కష్టమే పజిల్‌ను సాల్వ్ చేయడం. అయినా మీవి డేగ కళ్లయితే క్షణాల్లో కనిపెట్టేస్తారు. లేట్ ఎందుకు మీరు కూడా ఫోటోపై ఓ లుక్కేయండి.
Can You Spot the Snow Leopard In This Viral Picture@the_viralvideos @TheViralFever @itsgoneviraI @WhatsTrending #Viral #Trending pic.twitter.com/AdBLpb1sJJ
— telugufunworld (@telugufunworld) October 4, 2021
సహజంగా ఇలాంటివి చూసినప్పుడు చాలామంది ఫోటోషాప్‌తో ఈ చిత్రాన్ని తయారు చేసినట్లుగా భావిస్తారు. అలా అనుకుంటే పొరపాటే. ఇలాంటి దృశ్యాలను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో శ్రమించి మరీ తమ కెమెరాల్లో బంధిస్తారు. కాబట్టి మీరు కూడా ఈ పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆ ఫోటోలో చిరుతను కనిపెట్టలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..
Here Is The Answer… pic.twitter.com/AiNVUqaRQ2
— telugufunworld (@telugufunworld) October 4, 2021
Read Also: నాగుపాముకు చుక్కలు చూపించిన ఉడుత.. పోరు మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు!
మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో చాలా మంది గుర్తించలేకపోయారు.!
పిల్లల ముందు ఈ 5 పనులు తల్లిదండ్రులు చేయకూడదు.. ఖచ్చితంగా గుర్తించుకోండి!
