Viral: నాన్నా సిల్లీ పజిల్స్ ఎవరైనా చేస్తారు.. ప్రకృతి విసిరే సవాళ్లే చాలా టిపికల్.. ఇదెంటో చెప్పే సత్తా మీకుందా?
ఈ మధ్య కాలంలో ఫోటో పెట్టి ఇది కనిపెట్టండి.. కనిపెడితే ఖతర్నాక్, తోపు, తురుము అనే కంటెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఫోటో పెట్టి ఇది కనిపెట్టండి.. కనిపెడితే ఖతర్నాక్, తోపు, తురుము అనే కంటెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. అందులో నిగూఢ రహస్యాన్ని కనిపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు స్వతహాగా కనిపెడితే.. మరికొందరు ఆన్సర్ చూసేసి కనిపెట్టినట్లు ఫీలవుతుంటారు. ఇంకొందరు మనకెందుకు బ్రో అంటూ లైట్ తీసుకుంటున్నారు.
మీలో ఆ సత్తా ఉందా మరి?
వాస్తవానికి ఇవి మాంచి కిక్క్ ఇచ్చే ఫజిల్స్. అంతేకాదండోయ్.. దీనిని కనిపెట్టడం వల్ల టైమ్ వేస్ట్ అని మీరు భావిస్తుండొచ్చేమో గానీ.. వందకు వంద శాతం బెనిఫిట్సే ఉన్నాయి. అవునండీ.. కత్తికి పదును పెడితే షార్ప్‌గా ఉన్నట్లు.. మన బుర్రకు కూడా పని చెబితేనే సరిగ్గా పని చేస్తుంది. లేదంటే ఆయింత బద్దకంతో మరింత మొద్దుబారిపోతుంది. అందుకే అప్పుడప్పుడయినా జరంత బుర్రకు పని చెప్పాలి. ఇక ప్రకృతితో కూడిన ఫజిల్స్ అయితే మెదడుకు మేత పెట్టడమే కాకుండా.. మనసుకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాంటి అద్దిరిపోయే ఫజిల్‌ను, ప్రకృతి విసిరిన ఛాలెంజ్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో ఎడిట్ లేదు.. మతలబు లేదు. ఓన్లీ నేచర్. ఆ నేచర్ విసిరిన సవాల్‌ను మీరిప్పుడు చేజ్ చేయాలి. మరి ఆ సత్తా మీలో ఉందా? ఉంటే అదేంటో ఈజీగా చెప్పేయాలి మరి.
తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి సామ్రాట్ గౌడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. అదేంటో చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఛాలెంజ్ వేసినప్పటికీ.. నిజానికి మాత్రం ప్రకృతి విసిరిన ఛాలెంజ్ అనే చెప్పాలి. అవును మరి.. సహజ సిద్ధంగా చెట్టు నుంచి వచ్చి ఆ రూపం.. అచ్చం మనిషి కాలి వేళ్ల మాదిరిగానే ఉంది. చూడటానికి కాలి వేళ్లలాగే ఉన్నప్పటికీ.. వాస్తవానికి మాత్రం అదొక ఫంగస్. జిలారియా పాలిమార్ఫా, సప్రోబిక్ ఫంగస్ అనే పేర్లతో దీనిని పిలుస్తారు. ఇది అడవిలో కూలిపోయిన మహావృక్షానికి ఏర్పడింది. మనిషి వేళ్ల రూపంలో ఇది ఏర్పడటంతో చాలా వింతగా కనిపిస్తోంది. అందుకే దీనిని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ షేర్ చేశారు.
వైరల్ అవుతున్న ఫోటో ఇదే..
Can you guess what is this???? pic.twitter.com/7BbQjP0kH8
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) January 10, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..