Optical Illusion: సవాల్‌ స్వీకరించే సత్తా మీకుందా.? అయితే ఈ ఫొటోలో ఉన్న బాతును కనిపెట్టండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూజన్‌.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఈ పదం ఎక్కువగా ట్రెండింగ్‌ అవుతోంది. కంటికి, మెదడుకు పరీక్ష పెడుతూ, ఆసక్తిని పెంపొందించే ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి...

Optical Illusion: సవాల్‌ స్వీకరించే సత్తా మీకుందా.? అయితే ఈ ఫొటోలో ఉన్న బాతును కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2023 | 4:22 PM

ఆప్టికల్ ఇల్యూజన్‌.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఈ పదం ఎక్కువగా ట్రెండింగ్‌ అవుతోంది. కంటికి, మెదడుకు పరీక్ష పెడుతూ, ఆసక్తిని పెంపొందించే ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మీ కంటి పవర్‌కు సవాల్‌ అంటూ ఇలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరు క్రియేటర్లు ప్రత్యేకంగా ఇలాంటి ఫొటోలను రూపొందిస్తుండడం విశేషం.

తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. పైన ఫొటోలో కొందరు గ్రామస్తులు ఓ చోట కూర్చొని ఏదో విషయమై చర్చిస్తున్నారు కదూ! అయితే ఈ ఫొటోలో ఓ బాతు దాగుతుంది గుర్తుపట్టారా.? అయితే ఈ బాతును గుర్తించడం అంత సులభం కాదు. ఫొటోలోని ప్రతీ చోటును గమనిస్తే కానీ ఆ బాతు కనిపెట్టడం కుదరదు.

సోషల్‌ మీడియాలో ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తే కేవలం 10 సెకండ్లలో బాతును కనిపెట్టగలరనే సవాల్‌ను విసిరారు. మీరూ ఓసారి ట్రై చేయండి పది సెకండ్లలో బాతును కనిపెట్టగలరేమో. ఏంటి ఎంత ట్రై చేసినా బాతును కనిపెట్ట లేకపోతున్నారా.? అయితే ఓసారి కూర్చిపైన వ్యక్తుల్లో కుడి చేయి వైపు రెండో వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. అతని కాళ్ల మధ్య ఒక బాతు దాక్కొని చూస్తోంది. అదండి విషయం కనిపించి కనిపించనట్లున్న ఆ బాతు అక్కడ దాగి ఉంది.

ఇవి కూడా చదవండి

Optical Illusion 1

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..