Trending: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఊహించని సీన్ కు మహిళ ఏం చేసిందో తెలుసా..
రైలు పట్టాలు దాటడం చాలా ప్రమాదకరం. రైల్వే స్టేషన్ లో ఎనౌన్స్మెంట్స్ చేసినా.. కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. రైల్వే పై వంతెనను ఉపయోగించాలని ఎన్ని సార్లు..
రైలు పట్టాలు దాటడం చాలా ప్రమాదకరం. రైల్వే స్టేషన్ లో ఎనౌన్స్మెంట్స్ చేసినా.. కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. రైల్వే పై వంతెనను ఉపయోగించాలని ఎన్ని సార్లు చెప్పినా.. పెడ చెవిన పెడుతుంటారు. మూర్ఖంగా పట్టాలు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడికి ఓ గూడ్స్ రైలు రావడంతో ఆమె పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఊహించని ఈ ఘటనలో ఆ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.
బీహార్ రాష్ట్రంలోని గయ సమీపంలోని తనుకుప్ప రైల్వేస్టేషన్‌లో ఓ గూడ్స్ రైలు ఆగింది. ఆ సమయంలో అవతలి వైపు ప్యాసింజర్ రైలు ఆగింది. దానిని ఎక్కేందుకు ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడ ఆగిన గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ.. సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. రైలు ఆమెపై నుంచి వెళ్లిపోయింది.
రైలు వెళ్లిపోయిన తర్వాత స్టేషన్ లో ఉన్న కొందరు తోటి ప్రయాణికులు.. ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేశారు. రైలు పై నుంచి వెళ్లిపోవడంతో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కాబట్టి రైలు ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పట్టాలు దాటకుండా.. రైల్వే పై వంతెనను ఉపయోగించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..