Viral Photo: ఫోటోలో కనిపిస్తోన్న వందలాది పెంగ్విన్‌ల మధ్య ఓ పాండా దాగి ఉంది.. గుర్తించగలరేమో ప్రయత్నించండి.
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. సినిమాలు, రాజకీయాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది...
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. సినిమాలు, రాజకీయాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్వి్ట్టర్ ఇలా ఏది ఓపెన్ చేసినా సరే.. సకల సమాచారం అరచేతిలోకి వచ్చేస్తోంది. మారుతోన్న సోషల్ మీడియా ట్రెండ్‌కు అనుగుణంగా క్రియేటర్స్ కూడా తమ పంథాను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇటీవల అలాంటి ఓ ఫొటోనే హల్చల్ చేస్తోంది.
పజిల్స్ అంటే మనలో చాలా మందికి ఆసక్తి ఉండేం ఉంటుంది. ముఖ్యంగా ఫోటోల్లో దాగి ఉండే జంతువులను, వస్తువులను కనుక్కోండి అంటూ సర్కూలేట్ అయ్యే ఫొటోలపై తెగ ఆసక్తి ఉంటుంది. నెటిజన్లు కూడా వీటిపై ఎక్కడలేని ఆసక్తి చూపిస్తుంటారు.
Can You Spot The Hidden Animal In This Viral Picture..#ViralVideo #Viral #Trending #TrendingNow @the_viralvideos @itsgoneviraI @TheViralFever @WhatsTrending @TrendingWeibo pic.twitter.com/8dov3AuPnV
— telugufunworld (@telugufunworld) October 5, 2021
ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి పజిల్ ఫోటోనే ఒకటి వైరల్ అవుతోంది. పైన ఫొటోలో సముద్ర తీరంలో వందలాది పెంగ్విన్‌లు సేద తీరుతున్నట్లు కనిపిస్తున్నాయి కదా.! అయితే ఈ పెంగ్విన్‌ల మాటున ఓ బుజ్జి పాండా కూడా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మీకు కూడా ఆ పాండా కనిపిస్తుంది. ఏంటి ఎంత ప్రయత్నించినా పాండా కనిపించడం లేదా.? అయితే ఓ సారి ఈ కింద ట్వీట్‌ను గమనించండి రెడ్ మార్క్ చేసిన చోట బుల్లి పాండా ఎలా నక్కి నక్కి చూస్తోందో. భలే ఉంది కదూ.. ఈ ఫోటో పజిల్. మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ స్నేహితులకు ఈ వైరల్ ఫోటోను పంపించి.. వారు గుర్తించగలరేమో చాలెంజ్ విసరండి.
Here is the answer… pic.twitter.com/qL2xRkOiVs
— telugufunworld (@telugufunworld) October 5, 2021