Viral Video: రోడ్డుపై లారీని ఆపిన గజరాజు.. లారీ పైకెక్కిన డ్రైవర్.. తర్వాత..

ఓ ఏనుగు రోడ్డుపైకి దర్జాగా వచ్చి లారీని ఆపింది.. తనకు లారీలో ఉన్నది కావాలని.. లేకుంటే ఇక్కడ నుంచి కదలలేరని హెచ్చరించింది. గజరాజు హెచ్చరికతో భయపడిన లారీ క్లీనర్...

Viral Video: రోడ్డుపై లారీని ఆపిన గజరాజు.. లారీ పైకెక్కిన డ్రైవర్.. తర్వాత..
Elephent
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 05, 2021 | 6:36 PM

ఓ ఏనుగు రోడ్డుపైకి దర్జాగా వచ్చి లారీని ఆపింది.. తనకు లారీలో ఉన్నది కావాలని.. లేకుంటే ఇక్కడ నుంచి కదలలేరని హెచ్చరించింది. గజరాజు హెచ్చరికతో భయపడిన లారీ డ్రైవర్ ఏనుగుకు కావాల్సింది ఇచ్చేసి.. అక్కడి నుంచి జారుకున్నారు. ఏంటి కథ చెబుతున్నారని అనుకుంటున్నారా.. కాదండి ఇది నిజం… ఇంతకీ ఏనుగు ఏం అడిగింది. వారు ఏం ఇచ్చారో తెలుసుద్దాం..

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని సత్యమంగళం-మైసూర్ జాతీయ రహదారిపై ఓ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఆ రహదారిలో చెరకు లోడ్‎తో లారీలు వెళ్తున్నాయి. చెరకు వాసన పసిగట్టిన ఓ గజరాజు తన పిల్లతో రోడ్డుపైకి వచ్చింది. లారీకి ఎదురుగా వెళ్లింది. లారీని కదలకుండా చేసింది. దీంతో లారీ అక్కడే ఆగిపోయింది.

చెరకు కోసమే ఏనుగు లారీని అడ్డుకుందని భావించిన లారీ డ్రైవర్.. వెంటనే లారీ పైకి ఎక్కి.. కొంత చెరకును రహదారిపై పడేశాడు. అది చూసిన గజరాజు తన ఏనుగు పిల్లతో చెరకు తినడం మొదలు పెట్టింది. దీంతో డ్రైవర్ లారీని ముందు నడిపి అక్కడ నుంచి బయటపడ్డారు. ఈ తతంగాన్ని అంత మరో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

Read Also.. Rohit Sharma Prank: ప్రాంక్ వీడియోతో భార్యను భయపెట్టిన హిట్‌మ్యాన్.. అసలు విషయం తెలిస్తే నవ్వులు పూయాల్సిందే