Mark Zuckerberg: ఎఫ్‌బీ ఎఫెక్ట్.. ఏడు గంటల్లో జుకర్‌బర్గ్‌కు వాటిల్లిన నష్టం ఎంతో తెలిస్తే షాకవుతారు.!

Facebook Loss: సోషల్‌ మీడియా సంస్థలకు ప్రతీ క్షణం వేల కోట్లతో సమానం. అలాంటిది ఏడు గంటలు అంతరాయం ఏర్పడితే.. దారుణంగా నష్టపోవాల్సిందే. ఇక ఇప్పుడు అదే జరిగింది...

Ravi Kiran

|

Updated on: Oct 05, 2021 | 4:26 PM

సోషల్‌ మీడియా సంస్థలకు ప్రతీ క్షణం వేల కోట్లతో సమానం. అలాంటిది ఏడు గంటలు అంతరాయం ఏర్పడితే.. దారుణంగా నష్టపోవాల్సిందే. ఇక ఇప్పుడు అదే జరిగింది. అక్టోబర్ 4వ తేదీ సోమవారం రాత్రి 9 గంటల నుండి నిలిచిపోయిన వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలు.. సుమారు ఏడు గంటల అనంతరం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మళ్లీ రీ-స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ఏడు గంటల్లో ఫేస్‌బుక్ సంస్థ ఎన్ని కోట్ల మేర నష్టపోయిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.

1 / 5
సుమారు ఏడు గంటల పాటు సాంకేతిక సమస్యలు కారణంగా ఈ మూడు యాప్స్ నిలిచిపోగా.. దీని వల్ల ఫేస్‌బుక్‌ సంస్థ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇక ఈ నష్టం విలువ సుమారు 7 బిలియన్‌ డాలర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్‌ ఐదో స్థానానికి పడిపోయాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నటివరకూ నాలుగో స్థానంలో ఉన్న జుకర్‌బర్గ్‌.. 5వ స్థానానికి పడిపోగా.. బిల్‌గేట్స్‌ నాలుగో స్థానానికి చేరారు.

2 / 5
సోమవారం నాటి అంతరాయంతో ఫేస్‌బుక్ సంస్థ వాటాలు ఒక్కసారిగా 4.9 శాతం పడిపోయాయి. దీంతో సెప్టెంబర్ రెండోవారం నుంచి ఇప్పటివరకు సంస్థ వాటాలు 15 శాతం పడిపోయినట్లయింది. ఇండియాలో ఫేస్‌బుక్‌ను 41 కోట్ల మంది వాడుతుండగా, వాట్సాప్‌కు సుమారు 53 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్ల మంది వరకు యూజర్లున్నారు. సేవల్లో అంతరాయానికిగానూ యూజర్లకు ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పారు.

3 / 5
కాగా, అంతరాయం కారణంగా జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితుల్లో యాడ్ టారిఫ్ పెంచడం కుదరని పని అని,    ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడుకోడానికి ఫేస్‌బుక్ ఏవిధమైన ఐడియాతో ముందుకు వస్తుందో చూడాలని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

4 / 5
 బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం అక్టోబర్ 5వ తేదీన టాప్‌-10 ప్రపంచ కుబేరుల జాబితా ఇలా ఉంది... 1. ఎలన్‌ మస్క్‌(210.6 బిలియన్‌ డాలర్లు), 2. జెఫ్ బెజోస్(185.9 బిలియన్‌ డాలర్లు), 3. బెర్నార్డ్ అర్నాల్ట్(153.3 బిలియన్‌ డాలర్లు), 4. బిల్‌ గేట్స్(124.1 బిలియన్‌ డాలర్లు), 5. మార్క్‌ జుకర్‌బర్గ్‌(121.6 బిలియన్‌ డాలర్లు), 6. లారీ పేజ్(120.7 బిలియన్‌ డాలర్లు), 7. సర్జీ బ్రిన్(115.2 బిలియన్‌ డాలర్లు), 8. ల్యారీ ఎల్లిసన్(103.6 బిలియన్‌ డాలర్లు), 9. స్టీవ్ బాల్‌మర్(101.9 బిలియన్‌ డాలర్లు), 10. వారెన్‌ బఫెట్‌(99.7 బిలియన్‌ డాలర్లు)

5 / 5
Follow us