Viral Photo: కేవలం 11 సెకన్లలోపు ఈ ఫోటోలో పామును కనిపెడితే.. మీ ఐ పవర్ కిర్రాక్ అంతే!

ఫోటో పజిల్స్ ట్రెండ్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. తాజాగా పజిల్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Viral Photo: కేవలం 11 సెకన్లలోపు ఈ ఫోటోలో పామును కనిపెడితే.. మీ ఐ పవర్ కిర్రాక్ అంతే!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 14, 2022 | 7:25 PM

పెద్దల నుంచి పిల్లల వ‌ర‌కు స్మార్ట్ ఫోన్‌ను ఉప‌యోగిస్తుండ‌డంతో ఇంట‌ర్నెట్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియా వినియోగం కూడా విస్తృతంగా పెరిగింది. ఇంకేముంది ప్రతీ రోజూ వివిధ రకాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్రపంచ‌ంలో ఏ మూల‌న ఏ వింత జ‌రిగినా వెంట‌నే సోషల్ మీడియాలో ద‌ర్శన‌మివ్వాల్సిందే. ఇక ఇటీవ‌లి కాలంలో ఫోటో పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఫోటో పజిల్ ఒకటి నెటిజన్ల మెదడుకు మేత వేస్తోంది. ఏదొక ఇంటి బ్యాక్‌యార్డ్‌లో ఓ పూల మొక్క ఉంది. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఓ నెటిజన్. ఇందులో పాము దాగుంది. అదెక్కడుందో కనిపెట్టండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. పైన పేర్కొన్న ఫోటో చూసిన వారందరూ కూడా అందులో పాము ఎక్కడుందో వెతకలేక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. మ‌రి మీరైనా కనిపెట్టగలరా.. లేట్ ఎందుకు ఫొటోపై ఓ లుక్కేయండి.

ఎంత చూసినా ఫొటోలో పాము ఎక్కడ ఉందో కనిపించలేదా.? పాము ఏం లేదు అక్కడ.. కేవలం భ్రమ మాత్రమేనని ఫిక్స్ అయిపోయారా.? అయితే మీ క‌ళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే లెక్క. కంగారుపడకండీ.. అందులో పాము ఉంది. మొక్కకు చుట్టుకుని ఉంది.. చిన్న క్లూ ఇస్తున్నాం.. ఫోటోకు కుడి చేతి వైపు చివరికి ఓసారి చూడండి.. మీకే తెలుస్తుంది. లేదంటే సమాధానం కోసం కింద ఫోటో నొక్కండి.