హైదరాబాద్‌లో ఒంటెపాల క్రేజ్..‘ఆ‘ పవర్ కోసమే!
హైదరాబాద్ నగరాన్ని ఒంటెపాల క్రేజ్ కమ్మేస్తోంది. ఒంటెపాలు తాగితే పుంసత్వం పెరుగుతుందన్న ప్రచారం జోరందుకోవడంతో లీటర్ పాల కోసం 500 రూపాయలు వెచ్చించేందుకు కూడా జనం వెనుకాడడం లేదు. పుంసత్వం పెరగడంతోపాటు బరువు తగ్గేందుకు కూడా ఒంటెపాలు పనికొస్తాయని చెబుతున్నారు. దాంతో ఒంటెపాల డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఒంటెపాలకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఏకంగా జైపూర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సిటీలో నెలకు దాదాపు 3వేల లీటర్లు వరకు ఒంటెపాలు అమ్ముడవుతున్నట్టు చెబుతున్నారు. లీటర్ బాటిల్ నుంచి […]
హైదరాబాద్ నగరాన్ని ఒంటెపాల క్రేజ్ కమ్మేస్తోంది. ఒంటెపాలు తాగితే పుంసత్వం పెరుగుతుందన్న ప్రచారం జోరందుకోవడంతో లీటర్ పాల కోసం 500 రూపాయలు వెచ్చించేందుకు కూడా జనం వెనుకాడడం లేదు. పుంసత్వం పెరగడంతోపాటు బరువు తగ్గేందుకు కూడా ఒంటెపాలు పనికొస్తాయని చెబుతున్నారు. దాంతో ఒంటెపాల డిమాండ్ మరింతగా పెరుగుతోంది.
ఒంటెపాలకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఏకంగా జైపూర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సిటీలో నెలకు దాదాపు 3వేల లీటర్లు వరకు ఒంటెపాలు అమ్ముడవుతున్నట్టు చెబుతున్నారు. లీటర్ బాటిల్ నుంచి చిన్న చిన్న బాటిల్స్‌లో 200 మిల్లీ లీటర్లు కూడా అమ్ముతున్నామని, మంచి రెస్పాన్స్ వస్తోందని చెబుతున్నారు. ఒంటెపాల వినియోగదారుల్లో అన్ని వర్గాల వారు ఉన్నారంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్లు, జిమ్‌లో వర్కవుట్ చేసేవాళ్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.
చాలా రోజుల నుంచి ఒంటెపాలు తాగుతున్నవాళ్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ పాలు పిల్లలకు బలాన్ని ఇస్తాయని, అలాగే చురుకుదనాన్ని పెంచుతాయని అంటున్నారు. ధర కొంచెం ఎక్కువైనా, రుచి కొంచెం ఉప్పగా ఉన్నా కొంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు.
అయితే డాక్టర్ల వెర్షన్ వేరే విధంగా ఉంది. కామెల్ మిల్క్ తాగటం వల్ల ప్రత్యేకంగా ఒనగూడే లాభనష్టాలు ఏమీ లేవంటున్నారు. పుంసత్వం పెరగటం, షుగర్ తగ్గటం అంతా భ్రమ అంటున్నారు జనం మాత్రం రకరకాల నమ్మకాలతో ఒంటెపాలు కొంటున్నారు. డాక్టర్లు చెప్పేదానితో నిమిత్తం లేకుండా వేలంవెర్రిగా తాగుతున్నారు.