ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న ఆరు సీట్ల వాహనం.. దీని ఖరీదెంతో తెలుసా..
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. కొత్త కొత్త అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే సామాజిక మాద్యమాల వేదికగా వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యాపార వేత్తల్లో

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. కొత్త కొత్త అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే సామాజిక మాద్యమాల వేదికగా వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. తాజాగా మరో కొత్త సృజనాత్మక ఆవిష్కరణను ట్విటర్ వేదికగా నెటిజన్లకు పరిచయం చేశారు. చూడటానికి బైక్‌లా కనిపిస్తున్నా.. ఆరుగురు కూర్చునే విధంగా, వేర్వేరు సీట్లతో పొడవుగా రూపొందించిన ఓ బ్యాటరీ వాహనం వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఒకసారి ఛార్జింగ్ పెడితే దీనిపై దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ఖరీదు కూడా రూ.10,000 నుంచి 12,000 వరకు ఈ వాహనాన్ని తయారు చేయొచ్చని వీడియోలో ఓ యువకుడు చెబుతున్నట్లు ఉంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఐరోపాలోని ట్రాపిక్ ఎక్కువుగా ఉండే పర్యాటక కేంద్రాల్లో కనిపించే టూర్ బస్సులా.. కేవలం చిన్నపాటి డిజైన్ మార్పులతో ఈ వాహనాన్నీ అంతర్జాతీయంగా వినియోగించవచ్చని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని, ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం అంటూ ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు.
ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. యువకుడి ప్రతిభను ప్రశంసిస్తూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఉద్యానవనాలు, జూపార్క్‌లు, ఆఫీస్ ప్రాంగణాల్లో ఇటువంటి వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయని కొందరు కామెంట్స్ చేశారు. సౌర ఫలకాలతో పైకప్పు ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఆరు సీట్ల వాహనం ఆవిష్కరలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూనే.. అదే సమయంలో గ్రామీణ ఆవిష్కరణలను హైలెట్ చేస్తున్నందుకు హ్యాట్సఫ్ అంటూ ఆనంద్ మహీంద్రాను నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలోనూ ఇలాంటి అనేక వీడియోలను సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా పోస్టు చేసిన సందర్బాలున్నాయి.




మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..