AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వరుడికి వధువు ఫ్లయింగ్‌ కిస్‌లు…లక్కీ కపుల్ అంటోన్న నెటిజన్లు

పెళ్లంటేనే సరదాలు, సంబరాలకు కేరాఫ్‌ అడ్రస్‌. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు.....

Viral Video: వరుడికి వధువు ఫ్లయింగ్‌ కిస్‌లు...లక్కీ కపుల్ అంటోన్న నెటిజన్లు
Basha Shek
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 23, 2021 | 12:33 PM

Share

పెళ్లంటేనే సరదాలు, సంబరాలకు కేరాఫ్‌ అడ్రస్‌. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సందడి మామూలుగా ఉండదు. మెహందీలు, సంగీత్‌లు, విందులు, వినోదాలు…ఇలా ఏ కార్యక్రమమైనా కోలాహలంగా సాగాల్సిందే. పైగా ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో మునపటి లాగే పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

బాల్కనీ నుంచి వరుడికి ఫ్లయింగ్‌ కిస్‌లు.. సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధువులు ఒద్దికగా, సైలెంట్‌గా ఉంటారు. అయితే ఓ పెళ్లి కూతురు మాత్రం కాబోయే భర్తకు అందరూ చూస్తుండగానే ఫ్లయింగ్‌ కిస్‌లు ఇచ్చింది. బాజా భజంత్రీలు, డప్పులతో గుర్రంపై వరుడు రావడాన్ని గమనించిన ఆమె వెంటనే అపార్ట్‌మెంట్‌ బాల్కనీ దగ్గరకు చేరుకుంది. కానీ అక్కడ ఇనుప గ్రిల్స్‌ అడ్డుగా ఉండడంతో తనకు కాబోయే భర్తను చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో కింద జనంలో ఒకరిని పిలిచిన వధువు…వరుడికి తాను బాల్కనీలో ఉన్న విషయాన్ని చెప్పమంది. ఎట్టకేలకు పైకి చూసిన వరుడు…బాల్కానీలో కాబోయే భార్యను చూసి తెగ మురిసిపోయాడు. చెయ్యి ఊపుతూ పలకరించాడు. దీంతో వధువు ముఖంలో సంతోషం వెల్లివెరిసింది. థమ్సప్‌ సింబల్‌ చూపించింది. ఆతర్వాత రెండు ఫ్లయింగ్‌ కిస్‌లు గాల్లోకి విసిరింది. ఇలా పెళ్లికి ముందే వధూవరుల సందడిని చూసిన కుటుంబ సభ్యులు, అతిథులు కేరింతలు కొట్టారు. దీంతో అక్కడ మరింత కోలాహలం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వీరిద్దరు లక్కీ కపుల్‌’ అంటూ నెటిజన్లు లవ్, హార్ట్‌ ఎమోజీలు పోస్ట్‌ చేస్తున్నారు.

Also Read:

Viral Video: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

Viral Dance: కాళ్లకు చక్రాలు కట్టుకుని క్లాసికల్ డ్యాన్స్‌..సూపర్బ్‌ అంటోన్న నెటిజన్లు…

Fantastic Catch Viral Video: వాట్ ఏ క్యాచ్.. బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్‌..! వైరల్ అవుతున్న వీడియో..