AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింగిల్ హ్యాండ్‌తో సింహాన్ని పరిగెత్తించిన అమ్మమ్మ..! తన మేకల్ని ఎలా కాపాడుకుందో చూస్తే..

అదేదో ఇంటి ముందుకు వచ్చిన వీధి కుక్క, లేదంటే పిల్లిని తరిమికొట్టినంత ఈజీగా ఆ వృద్ధురాలు ఆ భారీ సింహాన్ని తరిమికొడుతుంది. ఆమె చేతిలో ఉన్నది ఒక సాధారణ పాత్ర మాత్రమే.. కానీ ఆమె ధైర్యం ఆకాశం అంత ఎత్తులో ఉంది. అమ్మమ్మ ఈ భయంకరమైన రూపాన్ని చూసి, ఆ సింహం కూడా భయంతో పారిపోతుంది. ఈ దృశ్యం చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

Viral Video: సింగిల్ హ్యాండ్‌తో సింహాన్ని పరిగెత్తించిన అమ్మమ్మ..! తన మేకల్ని ఎలా కాపాడుకుందో చూస్తే..
Goat And Lion
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2025 | 4:42 PM

Share

సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. అడవికి రాజైన సింహం ఒక వృద్ధురాలికి మధ్య జరిగిన సంఘటనకు సంబంధించిన దృశ్యం ఇది. ఈ వీడియోలో ఒక మేకను ఇంటి ఆవరణలో కట్టివేసి ఉంచారు. దానిని చూసిన ఒక సింహం ఎర దొరికిందని మెల్లిగా ఆ మేక వద్దకు వచ్చింది. దానిపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది. కానీ, ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. అది చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.. వామ్మో ఇదేలా సాధ్యం అంటూ నెట్టింట తీవ్ర చర్చను సృష్టిస్తోంది. ఈ వైరల్‌ వీడియో ఒక వృద్ధురాలి ఇది ధైర్యం, చూస్తున్న వారికి హాస్యాస్పదంగా అనిపించే ప్రత్యేకమైన సంఘటనను చూపిస్తుంది. ప్రజలు దీనిని మళ్లీ మళ్లీ చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఒకరితో ఒకరు వీడియోను విపరీతంగా షేర్‌ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

వైరల్‌ వీడియోలో ఎర కోసం వచ్చిన సింహాం మేకపై దాడి చేయబోతుండగా, ఆ ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు అప్పుడే బయటకు వచ్చింది. మేకను తినేందుకు సిద్ధంగా ఉన్న సింహాన్ని చూస్తుంది.. అంతే ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన చేతిలో ఉన్న ఒక వెడల్పాటి బెసిన్‌ గిన్నెతో ఆ సింహంపై దాడి చేస్తుంది. అదేదో ఇంటి ముందుకు వచ్చిన వీధి కుక్క, లేదంటే పిల్లిని తరిమికొట్టినంత ఈజీగా ఆ వృద్ధురాలు ఆ భారీ సింహాన్ని తరిమికొడుతుంది. ఆమె చేతిలో ఉన్నది ఒక సాధారణ పాత్ర మాత్రమే.. కానీ ఆమె ధైర్యం ఆకాశం అంత ఎత్తులో ఉంది. వృద్ధురాలు ఏ మాత్రం భయం లేకుండా సింహం వైపు వెళ్లి ఆ పాత్రతో సింహాం తలపై ఒక్కటిచ్చింది. అమ్మమ్మ ఈ భయంకరమైన రూపాన్ని చూసి, ఆ సింహం కూడా భయంతో పారిపోతుంది. ఈ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

అయితే, ఈ వీడియో కనిపించేంత నిజమైనది కాదని కొందరు నెటిజన్లు వ్యాఖ్యనించారు. చాలా మంది ఈ వీడియోను AI సహాయంతో రూపొందించారని చెబుతున్నారు. సింహం, అమ్మమ్మ మధ్య ఇలాంటి ఘర్షణ నిజ జీవితంలో జరిగే అవకాశం లేదని అంటున్నారు. కానీ, ఈ వీడియో మాత్రం ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇది వినోదాత్మకంగా ఉండటమే కాకుండా, ధైర్యం ఎలాంటి పని చేయగలదో కూడా చూపిస్తుంది. దీనిని i.love.srikaranpur అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, వీడియోకి మాత్రం వేలల్లో వ్యూస్‌, లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!