Viral Video: స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…?

కేరళలో ఒక అసాధారణ సంఘటన వెలుగుచూసింది. జెండా వందనం కార్యక్రమంలో భారత జాతీయ జెండా జెండా స్తంభం పైభాగంలో ఇరుక్కుపోయింది. దీంతో అక్కడున్నవారు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉండగానే, ఎక్కడి నుండో ఒక పక్షి వచ్చి ఆ ఇరుక్కున్న జెండా ముడిని విప్పేసింది. ఈ ఘటన చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ వీడియోలో వాస్తవం ఏంతో.. ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి....

Viral Video: స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి...?
Flag Hoisting
Follow us

|

Updated on: Aug 17, 2024 | 12:51 PM

కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా  78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చినట్లు ఓ వీడియో సర్కులేట్ అవుతోంది. “కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది.  నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.” అన్నది ఆ వీడియో సారాంశం.

ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా..  దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.

వీడియో దిగువన చూడండి….

అసలు జరిగిన విషయానికి వస్తే…..  వీడియోను మీరు బాగా తీక్షణంగా గమనించండి.  ఆ పక్షి జెండా వద్దకు ఏం రాలేదు. అది జెండా ఎగరేసే క్రమంలో అక్కడి కొబ్బరి చెట్టు కొమ్మపైకి వచ్చి వాలింది. ఆ సమయంలో కొమ్మ కదలడం మీరు చూడవచ్చు. ఎప్పుడైతే పైన జెండా ఊడి పూలు రాలాయో.. అప్పుడు క్లాప్స్ కొట్టగానే ఆ పక్షి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్