Viral Video: BMW కారులో పశువులకు మేత తీసుకెళ్తున్న రైతు.. వీడియో వైరల్..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన పెంపుడు పశువులకు ఆహారం కోసం BMW కారులో పచ్చ గడ్డిని వేసుకుని తీసుకువెళుతున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ఊహాగానాలు చేస్తూ రకరకాల కామెంట్స్ ప్రారంభించారు. ఎవరి కారో చోరీకి గురైనట్లు అనిపిస్తోందని.. ఒకరు.. ఈ వ్యక్తి నిజంగా ధనవంతుడని మరొకరు కామెంట్ చేశారు.

జై జవాన్.. జై కిసాన్ అనే నినాదం మనది.. ఇంకా చెప్పాలంటే మన దేశం వ్యవసాయాధారిత దేశం. దేశంలోని ఎక్కువమంది ప్రజలు వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. అందరికి అన్నంపెట్టే అన్నదాత తనకు పిడికెడు అన్నం దొరికితే చాలు అనుకునే దుస్థిలో ఉన్నాడు.. అన్నదాత అంటే ప్రభుతాలకు, ప్రజలకు మాత్రమే కాదు ప్రకృతికి కూడా లోకువే.. అందుకే అతి వృష్టి, అనావృష్టిలతో రైతన్నని కంట కన్నీరు పెట్టుస్తూనే ఉన్నది. అదే సమయంలో నేడు కొందరు వ్యవసాయ దారులు ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేసి కాసుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ రైతు గురించి భారతదేశం మొత్తం చర్చనీయాంశం అయింది. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తికి చెందిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వ్యక్తి ఒక విలాసవంతమైన కారు అదీ BMW కారులో పశువులకు మేత తీసుకువెళుతునున్నట్లు కనిపిస్తుంది. అది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన పెంపుడు పశువులకు ఆహారం కోసం BMW కారులో పచ్చ గడ్డిని వేసుకుని తీసుకువెళుతున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ఊహాగానాలు చేస్తూ రకరకాల కామెంట్స్ ప్రారంభించారు. ఎవరి కారో చోరీకి గురైనట్లు అనిపిస్తోందని.. ఒకరు.. ఈ వ్యక్తి నిజంగా ధనవంతుడని మరొకరు కామెంట్ చేశారు.
వైరల్ వీడియో చూడండి
మీడియా నివేదికల ప్రకారం వార్తల్లో నిలిచిన వ్యక్తి బీహార్‌లోని సమస్తిపూర్‌లోని జిత్వార్‌పూర్ నివాసి అన్షు కుమార్. అతను స్వయంగా వ్యవసాయం చేస్తున్నాడు. అంతేకాదు పశువులను కూడా పెంచుతున్నాడు. తన ఆదాయంలో కొంత భాగం ఈ పశువుల పోషణ కోసం కేటాయిస్తాడు. బీఎండబ్ల్యూ నడుపుతున్న అన్షు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తాను వ్యవసాయం చేయడమే కాకుండా టూర్, ట్రావెల్ బిజినెస్ కూడా చేస్తానని చెప్పాడు.
బీఎండబ్ల్యూలో మేత తీసుకెళ్తున్న విషయంపై.. తాను రోజూ ట్రాక్టర్‌లో మేత తీసుకురావడానికి వెళ్లేవాడినని, అయితే ఆ రోజు తన ట్రాక్టర్ చెడిపోయిందని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో పశువులకు మేత తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో బీఎండబ్ల్యూలో మేత సేకరించేందుకు వెళ్లి పొలం నుంచి తిరిగి వస్తుండగా ఎవరో వీడియో తీసి వైరల్ చేశారు. నేను పెంచుకుంటున్న పశువులకు మేత కారులో తెస్తే తప్పేంటని ప్రశ్నించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..