AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce Celebrations: భోపాల్లో విడాకుల సెలబ్రేషన్స్.. మగవాళ్లకు మాత్రమే.. వైరల్ అయిన ఆహ్వాన పత్రిక

భార్య బాధితులకు సంతోషాన్ని  ఇచ్చే విధంగా విడాకులు తీసుకున్న మగవారి కోసం సెలబ్రేట్ చేయాలని తాము నిర్ణయించుకున్నామని సంస్థ పేర్కొన్నారు. అందుకనే విడాకుల సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం విడాకుల ఆహ్వాన పత్రిక వైరల్ అవ్వడంతో.. ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపేందుకు రీ డిజైన్ చేశారు. 

Divorce Celebrations: భోపాల్లో విడాకుల సెలబ్రేషన్స్.. మగవాళ్లకు మాత్రమే.. వైరల్ అయిన ఆహ్వాన పత్రిక
Divorce Celebration
Surya Kala
|

Updated on: Sep 12, 2022 | 3:19 PM

Share

Divorce Celebrations: మధ్యప్రదేశ్‌లోని భోపాల్లో ఓ ఎన్జీవో సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కని వినీ ఎరగని రీతిలో మగవారు విడాకుల తీసుకున్నందుకు వేడుక నిర్వహిస్తుంది. పెళ్లైన మగవాళ్లపై జరుగుతున్న అన్యాయాలపై భాయ్ వెల్ఫేర్ సొసైటీ పోరాడుతోంది. ఈ సంస్థ చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటాల ద్వారా ఇప్పటికే 18 మంది మగవాళ్లకు విడాకులు వచ్చాయి. దీంతో వీరి విడాకులను సెలబ్రేట్ చేయడానికి సంస్థ నిర్ణయించుకుంది. ఓ వేడుక నిర్వహిస్తుంది. అందుకు “విడాకుల ఆహ్వానం” అనే పేరుతో ఓ ఇన్విటేషన్‌ కూడా ప్రింట్ చేయించింది. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విడాకుల వేడుక సెప్టెంబర్ 18న జరగనుంది.

మగవారు విడాకుల తీసుకునే విషయాన్ని భాయ్ వెల్ఫేర్ సొసైటీ జీవితంలో సరికొత్త ఆరంభంగా పరిగణిస్తుంది. అందుకనే ఇలా వేడుకను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను ఆహ్వాన పత్రికలో పేర్కొంది. ముఖ్యంగా జయమాల విసర్జన్ (వివాహ మాల నిమజ్జనం), మగవాళ్ల సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి కార్యక్రమాలున్నాయి. విడాకుల సెలబ్రేషన్స్ లో విడాకులు తీసుకున్న మగవాళ్లు తమ స్వేచ్ఛను సెలబ్రేట్ చేసుకోనున్నారని.. భాయ్ వెల్ఫేర్ సొసైటీ పేర్కొంది. అంతేకాదు  భార్యా బాధితులైన మగవాళ్ల కోసం తమ సంస్థ పోరాడుతుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

గత రెండున్నరేళ్లలో 18 మంది మగవాళ్లు తమ జీవితాన్ని దుర్భరం చేసిన వివాహం నుంచి విముక్తి పొందారు. చట్టపరమైన కేసులు బాధితులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తాయని.. తాము హెల్ప్‌లైన్ ద్వారా బాధిత మగవారికి మానసికంగా స్థిరంగా ఉండేందుకు చేయూతనిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జకీ అహ్మద్ చెప్పారు. విడాకులు తీసుకున్న మగవాళ్లు తమ కొత్త జీవితాలను సానుకూల మనస్తత్వంతో, మరింత ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్లేందుకు తాము వేడుకలో దిశానిర్దేశం చేయనున్నామని తెలిపారు.

విడాకుల కోసం ఈ 18 మందిలో కొంతమంది ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితులకు సంతోషాన్ని  ఇచ్చే విధంగా విడాకులను సెలబ్రేట్ చేయాలని తాము నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. అందుకనే విడాకుల సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం విడాకుల ఆహ్వాన పత్రిక వైరల్ అవ్వడంతో.. ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపేందుకు రీ డిజైన్ చేశారు.

ఈ వేడుకల పై నెటిజన్లు కూడా తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఎక్కువమంది పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. మన చట్టం ప్రకారం విడాకులు తీసుకోవడం కష్టమని.. ఇలాంటి సెలబ్రేషన్స్ జరగాలని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇదొక వింత పార్టీగా మారింది.

రోజురోజుకీ విడాకుల కేసులు:

జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. మన దేశంలో ఏడాదికి సగటున కోటి వివాహాలు జరుగుతున్నాయి.  ఈ పెళ్లిలో 90 శాతం అరెంజ్డ్ మ్యారేజెస్. వీటిలో హిందూ వివాహాలు 80శాతం. అయితే పెళ్లిని పెటాకులు చేసుకుంటూ ఏడాదికి విడిపోతున్న జంటలు 13.6 లక్షలు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దేశంలో అధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో విడాకుల కేసులు ఎక్కువ ఉంది. ముఖ్యంగా మిజోరాంలో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి.

లెక్కల ప్రకారం మనదేశంలో ప్రతి 1000 వివాహ బంధాల్లో కనీసం 30 విడాకులకు వెళుతున్నాయి. అమెరికాలో ప్రతి 1000 పెళ్ళిళ్లకు 400 విచ్ఛిన్నమవుతున్నాయి. భారత్‌లో విడాకులకు 6 నెలల నుంచి 20 ఏళ్ల వరకు పడుతుండగా.. అమెరికాలో 2 ఏళ్లు, ఐరోపా దేశాల్లో 6 ఏళ్ల సమయం పడుతోందని తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..