AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: నెలకు రూ. 3 లక్షలు సంపాదన.. కోట్ల విలువైన ఆస్తి ఉన్న ఆటో డ్రైవర్.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు

ప్రస్తుతం ఉద్యోగం కంటే వ్యాపారం లేదా సొంతంగా ఆటో లేదా కాబ్ నడుపుకుంటే ఎక్కువ సంపాదించవచ్చు ఏమో.. ఎందుకంటే ఇటీవల చాలా మంది ఐటీ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేసి క్యాబ్ డ్రైవర్ గా మారుతున్న వారి గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ నెలసరి ఆదాయం.. అతని ఆస్తులు తెలిస్తే.. ఉద్యోగం వద్దు.. ఆటో డ్రైవర్ జాబ్ ముద్దు అంటారేమో.. ఎందుకంటే ఒక ఆటోడ్రైవర్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు.. కోట్ల ఆస్తిని కలిగి ఉన్నాడు..

Viral News: నెలకు రూ. 3 లక్షలు సంపాదన.. కోట్ల విలువైన ఆస్తి ఉన్న ఆటో డ్రైవర్.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు
Auto Driver
Surya Kala
|

Updated on: Oct 06, 2025 | 5:47 PM

Share

కర్ణాటకలోని బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్ ఆదాయానికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటోరిక్షా డ్రైవర్ చెప్పిన ప్రకారం అతనికి ₹5 కోట్ల (సుమారు $50 మిలియన్ USD) విలువైన రెండు విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. అతను నెలకు ₹3 లక్షలు (సుమారు $300,000 USD) సంపాదిస్తున్నాడు. ఆకాష్ ఆనందాని అనే యువకుడు ఆటోరిక్షా డ్రైవర్‌తో మాట్లాడాడు.. అప్పుడు ఆ ఆటోడ్రైవర్ తన వివరాలను వెల్లడించాడు. ఆకాష్ తరువాత ఆ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది, వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆకాష్ తో జరిగిన సంభాషణలో ఆటోరిక్షా డ్రైవర్ AI స్టార్టప్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే టీవీ9 తెలుగు ఆటోడ్రైవర్ చెప్పిన విషయాన్ని నిర్ధారించడం లేదు.

ఇవి కూడా చదవండి

‘ఆటో డ్రైవర్ ఆదాయ రహస్యం’

ఆకాష్ ఆనందాని x లో పోస్ట్ చేసాడు.. బెంగళూరుకి చెందిన ఆటో డ్రైవర్ తనకు సుమారు 5 కోట్ల విలువైన రెండు ఇళ్ళు ఉన్నాయని, రెండూ అద్దెకు ఇచ్చినట్లు చెప్పాడు. అంతేకాదు అతను నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాడని .. AI ఆధారిత స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పాడు. ఆకాష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు దీనిని లైక్ చేస్తున్నారు. ఆకాష్ ఆనందాని ప్రకారం డ్రైవర్ తాను తన జీవితాన్ని అటో డ్రైవర్ గా మొదలు పెట్టినట్లు.. తన మొదటి ఉద్యోగం ఇదేనని చెప్పాడు. నేను ఆటోరిక్షా డ్రైవర్‌ని మరిన్ని ప్రశ్నలు అడిగాను.. ఎందుకంటే అతను ఆపిల్ స్మార్ట్ వాచ్.. ఎయిర్‌పాడ్‌లు ధరించాడు.

ఫన్నీగా కామెంట్ చేస్తోన్న వినియోగదారులు

చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ఈ పోస్ట్‌ను జోక్‌గా తీసుకున్నారు. ఒకరు అతను తాగి ఉండవచ్చు” అని అన్నారు. మరొకరు “ఇది నాకు కథలా అనిపిస్తోంది. ఇది జరగకపోవచ్చు” అని రాశారు. మరొకరు జాగ్రత్తగా ఉండండి..అతను మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, అక్కడ మోసం చేయవద్దు అని హెచ్చరించాడు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..