AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 8 ఏళ్ల కుర్రాడు..! కారణం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..

ఓ 8 ఏళ్ల బాలుడు కుర్‌కురే అడిగినందుకు తల్లి కొట్టడంతో 112కు కాల్ చేశాడు. పోలీస్ అధికారి ప్రశాంతంగా మాట్లాడి, తర్వాత ఆ బాలుడి ఇంటికి వెళ్లి కుర్‌కురే ప్యాకెట్లు ఇచ్చారు. ఈ అరుదైన ఘటన, పోలీసుల మానవత్వంతో కూడిన స్పందన వీడియో వైరల్ అయి, ప్రశంసలు అందుకుంది.

తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 8 ఏళ్ల కుర్రాడు..! కారణం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..
Police
SN Pasha
|

Updated on: Oct 06, 2025 | 6:09 PM

Share

ఇండియన్‌ పోలీస్‌ ఎమర్జెన్సీ నంబర్‌ 112కు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. కాల్‌ లిఫ్ట్‌ చేసి.. హలో ఎవరు? అని ఓ పోలీస్‌ అధికారి అన్నాడు. అవతి వైపు నుంచి వణుకుతున్న గొంతుతో ఓ పిల్లాడు హలో పోలీస్‌ అన్నాడు. దాంతో పాపం.. పిల్లాడికి ఏం ఆపద వచ్చిందో అని ఆ పోలీస్‌ మరింత అలర్ట్‌ అయ్యాడు. చెప్పు బాబు.. ఏమైంది? అని అడగడంతో ఆ పిల్లాడు ఓ బాంబు పేల్చాడు. తన కన్నతల్లిపైనే కంప్లైయిట్‌ ఇచ్చాడు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలోని చితర్వాయ్ కాలా గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు కుర్‌కురే కొనివ్వమని అడిగినందుకు తన తల్లి, అక్క తనను కొట్టారని.. ఆ బాలుడు తన తల్లి మొబైల్ ఫోన్ తీసుకొని పోలీసు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 112కు కాల్ చేసి ఏడుపు ప్రారంభించాడు. చిప్స్ ప్యాకెట్ ఇవ్వమని అడిగినందుకు తన తల్లి, అక్క తనను కొట్టారని చెప్పాడు. కుర్కురే ప్యాకెట్ కొనడానికి ఆ బాలుడు తన తల్లిని రూ.20 అడిగాడు. ఆమె దీనికి అంగీకరించలేదు. అతను పట్టుబట్టడంతో, తల్లి, ఆమె కుమార్తె ఆ బాలుడిని కొట్టారు. దీనితో కలత చెందిన బాలుడు ఇండియన్ పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేశాడు.

ఫిర్యాదు పోలీసులకు చేరింది. అయితే కంప్లైయింట్‌ వచ్చిన సమయంలో పోలీస్‌లు వీడియో తీశారు. అది కాస్త వైరల్ అయింది. ఆ కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఆ కుర్రాడు తన పరిస్థితిని వివరిస్తుండగా పోలీసు అధికారి ప్రశాంతంగా అతనికి భరోసా ఇచ్చినందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఆ పోలీసు అధికారి ఆ బాలుడిని ఓదార్చడమే కాకుండా, ఇకపై ఆ బిడ్డను కొట్టవద్దని అతని తల్లికి కూడా చెప్పాడు. ఆ తర్వాత అతను ఆ చిన్నారి ఇంటికి వెళ్లి ఐదు లేదా ఆరు ప్యాకెట్ల కుర్కురే ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి