AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heidi Klum: మనదేశంలో ఈ ప్రదేశంపై మనసు పడ్డ జర్మన్ మోడల్.. ఎందుకంటే

జర్మన్ సూపర్ మోడల్, టీవీ హోస్ట్ వ్యాపారవేత్త హైడీ క్లమ్ మళ్ళీ తనకు భారత దేశం అంటే ఇష్టం అని.. నేను దేశం అంతా తిరిగాను.. కానీ దేశంలో తనకు ఒక ప్రదేశం తెగ నచ్చేసిందని.. అదే తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అని వెల్లడించింది. అయితే అది ముంబై కాదు.. తాను తనకు ఇష్టమైన నగరాన్ని ఇప్పటికే రెండు సార్లు సందర్శించానని.. అది నిజంగా ప్రత్యేకమైందని తెలిపింది. మరి జర్మన్ మోడల్ కు అంతగా నచ్చిన ప్రదేశం ఏమిటో తెలుసా..

Heidi Klum: మనదేశంలో ఈ ప్రదేశంపై మనసు పడ్డ జర్మన్ మోడల్.. ఎందుకంటే
Heidi Klum
Surya Kala
|

Updated on: Oct 06, 2025 | 4:28 PM

Share

జర్మనీ దేశంలో సూపర్ మోడల్, టెలివిజన్ హోస్ట్ హైడీ క్లమ్ భారతదేశ సంస్కృతి, వైవిధ్యం పట్ల తన అభిమానాన్ని ఎల్లప్పుడూ వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఇటీవల ఫ్యాషన్ వాచ్‌డాగ్ డైట్ సబ్యాతో జరిగిన చర్చలో హైడీ క్లమ్ భారతదేశంలో తాను పర్యటించిన అన్ని ప్రదేశాలలో.. పురాతన నగరం వారణాసి తనకు అత్యంత ఇష్టమైనదని వెల్లడించింది. జర్మన్‌లో జన్మించిన ఈ తార తాను రెండుసార్లు పవిత్ర నరమైన వారణాసిని సందర్శించానని .. ఈ నగరం నిజంగా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని చెప్పింది. వారణాసి శాంతి, ఆధ్యాత్మికత , కాలాతీత అందాన్ని ప్రసరింపజేసే గమ్యస్థానంగా అభివర్ణించింది.

ఘాట్లలో ఆధ్యాత్మిక సమావేశాలు

వారణాసితో హైడీ క్లమ్ బంధం గురించి చెబుతూ.. ఆమె తన భర్త, గాయకుడు సీల్‌తో వారణాసిని పర్యతిమ్సింది. ఆ సమయంలో ఆమె నగరంలోని పవిత్ర ఘాట్‌లను సందర్శిస్తూ సమయం గడిపింది. ప్రతి సాయంత్రం గంగా నది ఒడ్డున నిర్వహించే గంగా ఆరతికి హాజరైంది. వందలాది దీపాలు వెలిగించడం.. గంగా నదిలో దీపాలను విడిచి పెట్టడం.. పూజారులు ఊపిరి ఆపకుండా మంత్రాలను జపించడాన్ని చూసిన ఆ క్షణాన్ని తన మనసుని కదిలించిన క్షనంగా.. ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచిన సమయంగా అభివర్ణించింది. ఈ అనుభవం భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసం గురించి తనకు ఒక సంగ్రహావలోకనం ఇచ్చిందని ఆమె అన్నారు.

View this post on Instagram

A post shared by Heidi Klum (@heidiklum)

వ్యక్తిగత, సాంస్కృతిక సంబంధం

వారణాసి నగరం పట్ల ఆమెకున్న అభిమానం ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన క్షణాన్ని కూడా ప్రభావితం చేసింది. 2008లో హైడీ, సీల్ మెక్సికోలో మళ్ళీ తాము కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఈ వేడుకను వారణాసికి చెందిన ఒక హిందూ పూజారి నిర్వహించారు. ఇది భారతీయ ఆచారాల పట్ల ఆమెకున్న గౌరవాన్ని ప్రతిబింబించే ఒక సంఘటన. ఆమె వారణాసిని సందర్శించిన సమయంలో స్థానికంగా షాపింగ్‌ కూడా చేసింది. వారణాసి లోని షోరూమ్ లో చేతితో తయారు చేసిన నగలను కొనుగోలు చేసింది. భారతీయ కళాకారుల పట్ల ఆమెకున్న అభిమానాన్ని తెలిజేస్తుంది.

వారణాసి ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తుంది?

భారతదేశం అంతటా పర్యటించిన హైడీ క్లమ్ దేశ సారాన్ని, ఆధ్యాత్మికత, కళాత్మకత, చరిత్ర వారణాసి నగరం ప్రతి మూలలో ముడిపడి ఉందని భావిస్తుంది. అందుకనే ఆమెకు ఈ నగరం ఇతర గమ్యస్థానాలకు భిన్నంగా ప్రశాంతంగా కనిపించినిడ్. వారణాసి తనకు ఒక పర్యటన ప్రదేశం మాత్రమే కాదు.. తనతో నిరంతరం నిలిచిపోయే అనుభవం అని చెప్పింది హైడీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..