Viral Video: వార్నీ వానరం తెలివి చూశారా..? గాయపడిన కోతి నేరుగా మెడికల్ షాప్‌కి వెళ్లి ఏం చేసిందంటే..
వానర చేష్టలు ఎప్పుడూ మనుషుల్ని ఇబ్బంది పెట్టేవిగానే ఉంటాయి. అడవులు అంతరించిన పోతున్న ఈ కాలంలో తరచూ ఇళ్లలోకి దూరుతున్న కోతులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు చేస్తుంటాయి. పంట పొలాలు, పండ్లు, కూరగాయల తోటల్లో పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. కోతుల బెడదతో ప్రజలు, రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కొన్ని కొన్ని సందర్బాల్లో పలవురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు కోతులు కూడా తెలివి మీరిపోయాయి. వాటికి ఆపద వచ్చినా, అనారోగ్యానికి గురైన ఎలా స్పందించాలో నేర్చుకున్నాయి. అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.

అడవిలో నివసించే కోతులు ఎప్పుడూ గుంపులు, గుంపులుగానే నివసిస్తాయి. కొన్నిసార్లు మానవ నివాసాలలోకి కూడా వస్తాయి. అవి మందలో నివసిస్తున్నప్పుడు ఎవరూ వాటిని ఎదుర్కొనేందుకు ధైర్యం చేయరు. కానీ అదే జంతువు ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ దానిపై రాళ్ళు విసురుతారు. దానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. అలా కొన్నిసార్లు కోతులు మనుషుల చేతిలో గాయపడిన ఘటనలు కూడా చూస్తుంటాం.. అయితే, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కేసు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక కోతి స్వయంగా చికిత్స కోసం ఓ డాక్టర్ వద్దకే వెళ్లింది.
ఈ వైరల్ సంఘటన బంగ్లాదేశ్‌లోని మెహెర్‌పూర్ నుండి వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక కోతి స్వయంగా చికిత్స కోసం ఒక మెడికల్ షాకునే వచ్చింది. ఉన్న వ్యక్తికి తాను ఎక్కడ గాయపడ్డానో చెప్పడం ప్రారంభించింది. ఆ చిన్న కోతికి సహాయం చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. వారిలో ఒక వ్యక్తి ఆ కోతి గాయానికి కట్టు కట్టాడు. ఇదంతా కొందరు తమ సెల్‌ఫోన్ల ద్వారా వీడియో తీశారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియోను pia.bengaltigress అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వేలాది మంది ఈ వీడియోపై స్పందించారు. ఈ ప్రపంచంలో మానవత్వం ఇంకా బతికే ఉందంటూ చాలా మంది కామెంట్ చేశారు. ఈ కోతి నిజంగా చాలా తెలివైనదిగా మారిపోయింది సోదరా అంటూ మరికొందరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..