Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్న విమానంలో మంటలు.. రెక్కపై ప్రయాణికులు.. షాకింగ్‌ వీడియో వైరల్

ఆ విమానం కొలరాడో స్ప్రింగ్స్ విమానాశ్రయం నుండి బయలుదేరి డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతోంది. కానీ దానిని DIAకి దారి మళ్లించారు. ఆ విమానానికి ఉపయోగించిన విమానం బోయింగ్ 737-800 అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ నివేదించింది. వైరల్‌ అవుతున్న వీడియోల్లో విమానం చుట్టూ పొగలు కమ్ముకుంటుండగా, ప్రయాణీకులు విమానం రెక్కలపై నిలబడి ఉన్నట్లు చూపించారు.

Watch: 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్న విమానంలో మంటలు.. రెక్కపై ప్రయాణికులు.. షాకింగ్‌ వీడియో వైరల్
American Airlines
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 14, 2025 | 12:32 PM

అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొలరాడో రాష్ట్రంలో ఉన్న డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానంలో ల్యాండ్ అయిన వెంటనే మంటలు అంటుకున్నాయి. విమానాశ్రయం గేటు వద్ద ఆగిన విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఎయిర్‌పోర్ట్‌, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. విమాన రెక్కపై నిలిచిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారుల ప్రకారం, గేట్ C38 వద్ద ఆపి ఉంచిన విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా ప్రాణహాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానం నుండి సురక్షితంగా టెర్మినల్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆ విమానం కొలరాడో స్ప్రింగ్స్ విమానాశ్రయం నుండి బయలుదేరి డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతోంది. కానీ దానిని DIAకి దారి మళ్లించారు. ఆ విమానానికి ఉపయోగించిన విమానం బోయింగ్ 737-800 అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ నివేదించింది. వైరల్‌ అవుతున్న వీడియోల్లో విమానం చుట్టూ పొగలు కమ్ముకుంటుండగా, ప్రయాణీకులు విమానం రెక్కలపై నిలబడి ఉన్నట్లు చూపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ..
పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ..
మేం నిలబడ్డాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం
మేం నిలబడ్డాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం
ప్రశ్నించే పార్టీ.. సమస్యలు పరిష్కరించే పార్టీగా మారింది
ప్రశ్నించే పార్టీ.. సమస్యలు పరిష్కరించే పార్టీగా మారింది
ఈ ఏడాది ఎండలు భయంకరమే.. బాబోయ్.! తీవ్ర వడగాలులు.. జర జాగ్రత్త
ఈ ఏడాది ఎండలు భయంకరమే.. బాబోయ్.! తీవ్ర వడగాలులు.. జర జాగ్రత్త
హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
ఈ కూరగాయ విత్తనాలను లైట్‌ తీసుకోకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రాలు
ఈ కూరగాయ విత్తనాలను లైట్‌ తీసుకోకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రాలు
వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందా..? మహిళలకు దిమ్మదిరిగే షాక్‌!
వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందా..? మహిళలకు దిమ్మదిరిగే షాక్‌!
వాటి జోలికి వెళ్తే రంగు పడుద్ది..పోలీస్ సింగం స్ట్రాంగ్ వార్నింగ్
వాటి జోలికి వెళ్తే రంగు పడుద్ది..పోలీస్ సింగం స్ట్రాంగ్ వార్నింగ్
చిన్న పనికే విపరీతంగా అలసిపోతున్నారా?
చిన్న పనికే విపరీతంగా అలసిపోతున్నారా?
కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు..
కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు..