శాండ్‌విచ్‌లు దొంగిలిస్తూ పట్టుబడిన ఎలుకల జ్ఞాపకార్థం నిర్మించిన విగ్రహం..! ఈ వింత కథ తెలిస్తే అవాక్కే..
కొంతమంది తమ అభిమాన నటులు, నటీమణుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకుని పూజిస్తుంటారు. ఇంకొందరు తమకు దూరమైన కుటుంబ సభ్యుల విగ్రహాలను తయారు చేసుకుని గుడికట్టి పూజిస్తుంటారు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? కానీ మీరు ఎక్కడైనా ఎలుకల విగ్రహాన్ని చూశారా..?అవును ఆశ్చర్యపోతున్నారా..? మీరు విన్నతి నిజమే.. ఎలుక వినాయకుడికి వాహనం కదా.. అందుకు ఎలుకలకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అనుకుంటే పొరపాటే..ఆ అసలు విషయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఏదైనా ఒక విగ్రహం నిర్మించడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా దేవుని విగ్రహాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా మరణించిన నాయకులు, ప్రముఖుల విగ్రహాలను తయారు చేస్తారు. కొంతమంది తమ అభిమాన నటులు, నటీమణుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకుని పూజిస్తుంటారు. ఇంకొందరు తమకు దూరమైన కుటుంబ సభ్యుల విగ్రహాలను తయారు చేసుకుని గుడికట్టి పూజిస్తుంటారు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? కానీ మీరు ఎక్కడైనా ఎలుకల విగ్రహాన్ని చూశారా..?అవును ఆశ్చర్యపోతున్నారా..? మీరు విన్నతి నిజమే.. ఎలుక వినాయకుడికి వాహనం కదా.. అందుకు ఎలుకలకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అనుకుంటే పొరపాటే..ఆ అసలు విషయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఇది ఒక ఆసక్తికరమైన కథ. ఇది శాండ్‌విచ్‌లు తింటూ పట్టుబడిన ఎలుకల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహం! అవును .. ఇది కల్పిత కథ కాదు. ఇది లండన్‌లోని అతి చిన్న విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. దాని పేరు “ది టూ మైస్ ఈటింగ్ చీజ్”. మీరు లండన్ వెళితే ఈ ఎలుక విగ్రహాన్ని చూడవచ్చు. 1862 లో ఒక పరంజా భవనం నుండి పడి మరణించిన ఇద్దరు కార్మికుల జ్ఞాపకార్థం ఈ ఎలుక విగ్రహాన్ని నిర్మించారు..! ఇక్కడ ఆసక్తికరమైన కథ ఏమిటంటే కార్మికులకు, ఈ ఎలుకకు మధ్య సంబంధం ఏంటన్నది..
ఒక స్కాఫోల్డింగ్ భవనం నిర్మాణ సమయంలో ఇదే జరిగింది. నిర్మాణ సమయంలో ఇద్దరు నిర్మాణ కార్మికులు చీజ్ శాండ్‌విచ్ తెచ్చారు. ఆకలి వేయగానే తిందామని పక్కన పెట్టుకున్నారు. కానీ, కాసేపటి తర్వాత వెళ్లి చూసేసరికి అక్కడ శాండ్‌విచ్ కనిపించలేదు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం కలిగింది..ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ గొడవ పడటం మొదలుపెట్టారు. ఇలా వారు గొడవపడుతుండగానే.. అక్కడే ఒక ఎలుక శాండ్‌విచ్ తింటూ కనిపించిందట. దొంగ ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న కార్మికులు దాన్ని తిరిగి తీసుకుని తినడానికి వెళ్లారు. ఆ తర్వాత వారిద్దరూ కిందపడి చనిపోయారు. కార్మికులు శాండ్‌విచ్‌ల కోసం వెల్లి మరణించినందు వల్ల వారి జ్ఞాపకార్థం శాండ్‌విచ్ తింటున్న ఎలుక విగ్రహాన్ని ఏర్పాటు చేశారట.
కార్మికుల విగ్రహాలను కాకుండా ఇక్కడ ఎలుకల విగ్రహాలను చెక్కారు. అలా చివరికి అది ఎలుకల జ్ఞాపకార్థం చెక్కబడిన విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక శాండ్‌విచ్ ముక్క కోసం రెండు ఎలుకలు పోరాడుతున్నట్లు చిత్రీకరించే చిన్న విగ్రహం. ఈ విగ్రహం లండన్ నగరంలోని ఈస్ట్‌చీప్, ఫెన్‌చర్చ్ స్ట్రీట్‌లను కలిపే ఒక చిన్న వీధి ఫిల్‌పాట్ లేన్‌లో ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..