Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అనంత్‌ అంబానీ పెళ్లిలో మా వజ్రం పోయింది..! తెగ బాధపడిపోతున్న హీరోయిన్..

కిమ్ 1980 అక్టోబర్ 21న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించారు. 44 ఏళ్ల కిమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలలో ఒకరు. కిమ్ తన సంపదతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె రూ.1255 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, రూ.500 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం, అతని నికర విలువ రూ. 14 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

Watch Video: అనంత్‌ అంబానీ పెళ్లిలో మా వజ్రం పోయింది..! తెగ బాధపడిపోతున్న హీరోయిన్..
Kim kardashian diamond was lost
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 14, 2025 | 10:57 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం గత సంవత్సరం జరిగింది. అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ దంపతుల వివాహం జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎంతో అట్టహాసంగా జరిగింది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కోసం ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ డబ్బుని నీళ్లలా ఖర్చు చేశారనే వార్తలు అనేకం వైరల్‌ అయ్యాయి.. ఈ గ్రాండ్ వివాహానికి భారతదేశం, విదేశాల నుండి కూడా అనేక మంది ప్రముఖ వ్యక్తులు అంబానీ అతిథులుగా హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్, నటి కిమ్ కర్దాషియాన్, ఆమె అక్క ఖ్లో కర్దాషియాన్ హాజరయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించి ఆయన ఇప్పుడు ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టారు.

ముఖేష్ అంబానీ తన కొడుకు వివాహానికి అమెరికాకు చెందిన ప్రముఖ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్‌ను కూడా ఆహ్వానించారు. ఈ గ్రాండ్ వివాహానికి కిమ్ కర్దాషియాన్ తన చెల్లెలు ఖ్లో కర్దాషియాన్‌తో కలిసి వచ్చింది. గత సంవత్సరం వారు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యేందుకు భారతదేశానికి వచ్చారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించి ఇప్పుడు వారు షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు. అంబానీ పెళ్లి సమయంలో తన వజ్రం పోయిందని కిమ్ చెప్పింది. అంబానీ పెళ్లి సమయంలో తన వజ్రం పోయిందని కిమ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

కిమ్ కర్దాషియాన్ ‘ది కర్దాషియన్స్’ షో ద్వారా వార్తల్లో నిలిచారు. ఇటీవల కర్దాషియానుషులు ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన కొత్త ప్రోమోను షేర్‌ చేశారు. ఇందులో రాధిక, అనంత్ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూపించారు. అనంత్-రాధిక వివాహంలో కిమ్ చాలా ఎంజాయ్ చేసింది. అనంత్, రాధిక వివాహ సమయంలో కిమ్ వేర్వేరు వేడుకలకు వేర్వేరు దుస్తులు ధరించింది. ఆమె భారతీయ దుస్తులలో కూడా కనిపించింది. భారతదేశ పర్యటన సందర్భంగా, అంబానీ వివాహంలో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో కూడా కలిశారు. ఆమెతో తన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఆమెను ‘క్వీన్’ అని పిలిచారు. కిమ్, ఖ్లో ముంబైలోని ఇస్కాన్ ఆలయాన్ని కూడా సందర్శించారు. కిమ్ పిల్లలకు ఆహారం వడ్డిస్తున్న ఫోటోలు కూడా బాగా వైరల్‌గా మారాయి.

వీడియో ఇక్కడ చూడండి..

కిమ్ 1980 అక్టోబర్ 21న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించారు. 44 ఏళ్ల కిమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలలో ఒకరు. కిమ్ తన సంపదతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె రూ.1255 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, రూ.500 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం, అతని నికర విలువ రూ. 14 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..