Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: తండాల్లో హోలీ వేడుకలు వెరీ స్పెషల్.. ఊరు ఊరంతా పెద్ద పండగే..! అదేంటంటే..

గ్రామ గ్రామాలకు నడుమ గడియ దూరంలో ఉండే గిరిజన కుటుంబాలను ఒకే గూటికి చేర్చి సంబరాలు చేసే పండుగ హోలీ ...ఈ హోలీ ని గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ,యువకుల నుంచి వృద్దుల వరకు ఈ హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. ఇలాంటి సంబరాలకు కేరప్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్యాతండా. ఇక్కడ హెలీ స్పెషల్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Khammam: తండాల్లో హోలీ వేడుకలు వెరీ స్పెషల్.. ఊరు ఊరంతా పెద్ద పండగే..! అదేంటంటే..
Lokyatanda Holi
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Mar 14, 2025 | 11:12 AM

హోలీ పండుగకు ఆ తండాకు ఓ ప్రత్యేకత ఉంది… పుట్టిన బిడ్డకు నామకరణం చేయాలంటే హోలీ పండుగ రావాల్సిందే… ఘనంగా హోలీ ఆడాల్సిందే…ఆనందం, అప్యాయత, అనురాగం, అనుబందం, అపూర్వం, ఆత్మీయత, అద్వితీయం, అందరి కలయిక….ఆకర్షితమైన అద్బుతమైన వేడుకలకు కేరాఫ్ హోలీ.  గ్రామ గ్రామాలకు నడుమ గడియ దూరంలో ఉండే గిరిజన కుటుంబాలను ఒకే గూటికి చేర్చి సంబరాలు చేసే పండుగ హోలీ …ఈ హోలీ ని గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ,యువకుల నుంచి వృద్దుల వరకు ఈ హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. ఇలాంటి సంబరాలకు కేరప్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్యాతండా. ఇక్కడ హెలీ స్పెషల్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండా లో గిరిజన సంస్కృతి కి అద్దం పట్టే విదంగా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఈ హోలీ సంబరాలు మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకున్నారు. హోలీ సంబరాలకు గిరిజనులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తారు. మెదటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే కాముని దహనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. కుల పెద్దలైన… గేడియగా పిలవబడే తండా పెద్దలు లాంచనంగా ప్రారంబిస్తారు. పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తారు. తండాలో హొలీ రోజు నుంచి పుట్టిన ప్రతి బిడ్డకు మళ్లీ హొలీ పండుగ రోజు మాత్రమే నామకరణం చేయడంఆనవాయితీ. అప్పటివరకు పుట్టిన బిడ్డలకు నామకరణం చేయరు. మూడో రోజు తండా వాసులు రంగోలి ఆడుతారు. కాముని దహనం చేసిన ప్రాతం నుంచి సేకరించిన బూడిదను తండా యువకులు శరీరం పై చల్లుకుంటారు.  ఆ తర్వాత రంగులు చల్లుకుంటు ఆడుకుంటారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇలా మూడు రోజుల వేడుకతో లోక్యాతండ జనసందడితో కిటకిటలాడింది. హోలీ వేడుకలకు తండావాసులు తమ బందువులను తమ గ్రామానికి ఆహ్వనిస్తారు. తండా వాసులు ఎక్కడ స్థిరపడిన హోలీ రోజు మాత్రం లోక్యాతండాకు చేరుకుంటారు. ప్రతి హోలీ పండుగకు గ్రామంలో మహిళలు కొత్త వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. నూతన వస్త్రాలు ధరించి హోలీ జరుపుకుంటారు.

ఈ సారి కూడా మూడో రోజున హోలీని గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. పెద్దల నుంచి చిన్నారుల వరకు రంగులు చల్లుకుని ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ సంతోషంలో మునిగి తేలారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..