Coriander Leaves: పచ్చి కొత్తిమీరతో షుగర్ కంట్రోల్.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో రోగాలకు చెక్..!
జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ చాలా మందిని ప్రభావితం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడటానికి గల కారణాల గురించి మాట్లాడుకుంటే, పెరుగుతున్న ఊబకాయం, మద్యం, సిగరెట్లు, ఫాస్ట్ ఫుడ్ వినియోగం ప్రజలను షుగర్ బాధితులుగా మార్చేస్తున్నాయి. అయితే, డయాబెటిస్ ఉన్న రోగులు తమ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. చక్కెరను నియంత్రించడంలో మందులు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో, ఇంటి నివారణలు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటాయి. చక్కెరను నియంత్రించడానికి కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. డయాబెటిక్ బాధితులకు కొత్తిమీర, ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొత్తిమీర, ధనియాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలవని, ఆకలిని ప్రేరేపిస్తాయని, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని అనేక అధ్యయనాలు చూపించాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5