Viral Video: అంద‌రూ హ్యాపీగా బాల్కానీలో జబర్దస్త్ పార్టీ… ఇంత‌లో ఒక్క‌సారిగా షాక్.. కెమేరాకు చిక్కిన ఘటన

బాల్కానీలో కూర్చొని ధూమ్‌ధామ్‌గా పార్టీలు చేసుకుంటున్నారా? ఇద్దరు కంటే ఎక్కువ మందితో కలిసి అక్కడ తీన్‌మార్‌ డ్యాన్సులు చేస్తున్నారా? అయితే...

Viral Video:  అంద‌రూ హ్యాపీగా  బాల్కానీలో జబర్దస్త్ పార్టీ... ఇంత‌లో ఒక్క‌సారిగా షాక్.. కెమేరాకు చిక్కిన ఘటన
Balcony Collepse
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 8:54 PM

బాల్కానీలో కూర్చొని ధూమ్‌ధామ్‌గా పార్టీలు చేసుకుంటున్నారా? ఇద్దరు కంటే ఎక్కువ మందితో కలిసి అక్కడ తీన్‌మార్‌ డ్యాన్సులు చేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ వార్త. మీకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉంది. అసలేం జరిగిందంటే సముద్ర తీరంలో ఉన్న ఓ ఇంట్లో బీచ్ అందాలను చూస్తూ పార్టీలో మునిగితేలుతున్న కొంతమంది ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒకేసారి 15 మంది బాల్కానీలో నిలుచుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు నిలుచున్న ఇంటి బాల్కానీ ఒక్కసారిగా కుప్పకూలడంతో వారంతా కింద ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని మాలీబులో చోటుచేసుకుంది.

మే 8న ఓ ఇంట్లో సుమారు 30 మంది పార్టీ చేసుకున్నారు. వీరిలో సుమారు 15 మంది బాల్కానీలో కూర్చొని సముద్ర అందాలను చూస్తూ ఎంజాయ్‌ చేశారు. సామర్థ్యం కంటే ఎక్కువ మంది నిలుచువడం వల్ల బాల్కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి తీరంలో ఉన్న రాళ్ల పై పడ్డారు. ఆ బాల్కనీ మరింత ఎత్తులో ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పలువురు భావిస్తున్నారు.

ఈ ఘటన పక్క భవనంలోని సీసీటీవీలో రికార్డైంది. పోలీసులు ఈ వీడియోను సేకరించి కేసు విచారిస్తున్నారు. కరోనా వైరస్ సమయంలో అంతమంది ఒకే ఇంట్లో గుమిగూడి పార్టీ చేసుకోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్నిమాపక అధికారులు ఆ ఇంటిని శిథిల నివాసంగా గుర్తిస్తూ యజమానికి నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ ఘటనపై యజమాని స్పందిస్తూ.. వీకెండ్ పార్టీ కోసం ఓ వ్యక్తి తన గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకున్నారని, ఆరుగురు మాత్రమే ఉంటామని చెప్పినట్లు తెలిపింది.

ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో..

Also Read: మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..

ఈ ప్రమాదకరమైన చేపలు సుమద్రంలో వేల అడుగుల లోతులో ఉంటాయి.. కానీ

తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్
విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్