Viral Video: ఏందిరయ్యా మీ లొల్లి.. మెట్రోలో ఏం చేశారో తెలుసా..? వైరల్ వీడియో

సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌కు కొదవే లేదు.. ఏదైనా తేడా కొడితే.. ఆ చిత్రాల నుంచి వీడియోల వరకు అన్నీ తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.. అది మెట్రోలో ఇద్దరు వ్యక్తులు గొడపడుతున్నారు.. చూస్తే ట్రైన్ మొత్తం ఖాళీగానే కనిపిస్తోంది.. కానీ..

Viral Video: ఏందిరయ్యా మీ లొల్లి.. మెట్రోలో ఏం చేశారో తెలుసా..? వైరల్ వీడియో
Delhi Metro
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 24, 2024 | 12:44 PM

సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌కు కొదవే లేదు.. ఏదైనా తేడా కొడితే.. ఆ చిత్రాల నుంచి వీడియోల వరకు అన్నీ తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.. అది మెట్రోలో ఇద్దరు వ్యక్తులు గొడపడుతున్నారు.. చూస్తే ట్రైన్ మొత్తం ఖాళీగానే కనిపిస్తోంది.. కానీ.. ఈ ఇద్దరు మాత్రం సీట్ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు.. ఢిల్లీ-ఘజియాబాద్ మెట్రోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

ఢిల్లీ మెట్రోలో జనం పొట్లాటకు దిగిన వీడియోలను, అదేవిధంగా రోమాన్స్ చేసుకుంటున్న వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.. ఈ క్రమంలోనే.. ఢిల్లీ-ఘజియాబాద్ మెట్రోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కొట్టుకోవడం కనిపిస్తుంది.. అయితే ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను ఆపడానికి ప్రయత్నించారు.

సీటు విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైందని వీడియోలో తెలుస్తోంది. ఇది మాటలతో ప్రారంభమై.. తరువాత భౌతిక వాగ్వాదానికి దారితీసింది.. ఇరువురు కూడా పిడిగుద్దులతో రెచ్చిపోయారు..

వీడియో చూడండి..

మెట్రో కంపార్ట్‌మెంట్‌లో అప్పటికే ఓ వ్యక్తి కూర్చున్న సీటులో మరో వ్యక్తి కూర్చొడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన మొదలైందని పేర్కొంటున్నారు. అతను కూర్చున్న వ్యక్తిని కొంచెం జరగమని అడిగాడు.. కానీ అతని అభ్యర్థనను మరో వ్యక్తి తిరస్కరించాడని.. ఇది భౌతిక పోరాటానికి దారితీసిందని పేర్కొంటున్నారు..

ఈ సంఘటన వీడియోను Priya singh అనే వినియోగదారు Xలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ గొడవ పడ్డ వారిలో ఒకరు హాపూర్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన వ్యక్తి అని చెప్పుకుని, మరో వ్యక్తిని బెదిరించాడు.. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

కాగా.. ఈ ఘటనపై నెటిజన్లు పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మెట్రోలో ఇలాంటివేంటంటూ ఫైర్ అవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..