AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ వ్యక్తి పక్కా సింగిల్ సింతకాయ్.. తన బైక్‌పై బాలిక కూర్చుందని ఏం చేశాడో చూస్తే..!

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని కోపాన్ని తెప్పిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి.

Viral Video: ఈ వ్యక్తి పక్కా సింగిల్ సింతకాయ్.. తన బైక్‌పై బాలిక కూర్చుందని ఏం చేశాడో చూస్తే..!
Viral Video
Ravi Kiran
|

Updated on: Mar 11, 2023 | 1:51 PM

Share

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని కోపాన్ని తెప్పిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌ కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది . మీరూ ఆ వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం. లేట్ ఎందుకు అదేంటో చూసేద్దాం పదండి..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఉండటాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో అటుగా స్కూల్‌లో చదువుతున్న కొందరు బాలికలు వెళ్తున్నారు. వారిలో ఒక బాలిక.. బైక్‌ను చూసి.. దానిపై కూర్చుని ఫోటో దిగాలనుకుంటుంది. ఆమె ఫ్రెండ్స్ సాయంతో ఓ ఫోటో దిగి..  ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతారు. ఇంతవరకు బాగానే ఉంది కదా.. అయితే సీన్‌లో ట్విస్ట్ ఇక్కడే వస్తుంది.

ఇక ఈ తతంగాన్ని అంతటిని ముందు నుంచి గమనిస్తూనే ఉంటాడు బైక్ యజమాని. వారంతా కూడా అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే.. అతడు బైక్ దగ్గరకు వచ్చి.. ఓ మగ్గుతో నీళ్లు దానిపై పోసి శుభ్రం చేస్తాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియోపై ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.