Watch Video: మాతో పెట్టుకుంటే మడతడి పోధీ..! ప్రయాణికులతో వెళ్తున్న లారీని అమాంతం ఎత్తేసిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగింది..
సఫారీకి వెళ్లడం అందరికీ ఆనందకరమైన క్షణం. జంతువులను వాటి సహజ ఆవాసాలలో దగ్గరగా చూడటంలోని ఆనందమే వేరు. కానీ కొన్నిసార్లు ఇది కూడా ప్రమాదకరమైనదిగా మారుతుంది, దిగ్భ్రాంతికరమైన క్షణానికి సాక్షిగా ఉంటుంది. సఫారీకి వెళుతున్నప్పుడు జరిగిన అనేక ప్రమాదాల దృశ్యాలను మీరు సోషల్ మీడియాలో ఇప్పటికే అనేకం చూసి ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూస్తేనే భయంతో వణికిపోవాల్సిందే.
ఏనుగు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటే, వాటి ఆట, దంతాలు, ప్రేమ అన్నీ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఏనుగులు తెలివైన జంతువులు… మనుషులతో మంచి అనుబంధం కలిగి ఉంటాయి… మనిషి ప్రేమకు ప్రతిస్పందిస్తాయి. అయితే ఇవే ఏనుగులకు చిరాకు, కోపం వస్తే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. దీనికి తగిన ఆధారాలు అనేకం ఉన్నాయి. జంగిల్ సఫారీలో కోపంతో ఉన్న ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం చూస్తుంటే భయంతో గుండె వేగం పెరుగుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. వీడియో ఇప్పుడు పెద్ద సంఖ్యలో వ్యూస్ సాధించింది.
సఫారీకి వెళ్లడం అందరికీ ఆనందకరమైన క్షణం. జంతువులను వాటి సహజ ఆవాసాలలో దగ్గరగా చూడటంలోని ఆనందమే వేరు. కానీ కొన్నిసార్లు ఇది కూడా ప్రమాదకరమైనదిగా మారుతుంది, దిగ్భ్రాంతికరమైన క్షణానికి సాక్షిగా ఉంటుంది. సఫారీకి వెళుతున్నప్పుడు జరిగిన అనేక ప్రమాదాల దృశ్యాలను మీరు సోషల్ మీడియాలో ఇప్పటికే అనేకం చూసి ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూస్తేనే భయంతో వణికిపోవాల్సిందే. ఇక్కడ ఒక బలమైన ఏనుగు పర్యాటకులతో వెళ్తున్న లారీని పైకి లేపి నేలపై ఎత్తేసింది. Wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోలో డ్రైవర్ సహా పర్యాటకులతో నిండిన లారీని ఏనుగు తన తొండంతో పైకెత్తి నేలపై కుదిపేసింది. అలా రెండుసార్లు ఏనుగు లారీని ఎత్తి తన బలాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించింది. ఈ సమయంలో పర్యాటకులు ప్రాణభయంతో అరుపులు, కేకలు వేశారు. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవటంతో డ్రైవర్ వాహనాన్ని అక్కడి నుంచి వెంటనే తరలించేసిన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ భయానక దృశ్యాన్ని పక్కనే ఉన్నవారు కెమెరాల్లో బంధించగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
View this post on Instagram
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పర్యాటకులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. ఏనుగు కూడా తన కోపాన్ని ప్రదర్శించి వాహనం ముందుకు వెళ్లకుండా ఆపలేదు. దీంతో పర్యాటకులు ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ఇది దక్షిణాఫ్రికాలో జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తెలివైన ఏనుగు టూరిస్టులను ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించింది. ఈ వీడియో ఇప్పుడు చాలా వీక్షణలను పొందింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…