Watch Video: రైలు పట్టాలపై పడిన బాలికను రక్షించిన యువకుడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో వచ్చే ఆసక్తికర అశాంలపై స్పందిస్తూ ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఆయన తాజాగా.. ఓ వ్యక్తి చేసిన సాహసంపై ప్రశంసలు..

Watch Video: రైలు పట్టాలపై పడిన బాలికను రక్షించిన యువకుడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra
Follow us
Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 14, 2022 | 3:12 PM

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో వచ్చే ఆసక్తికర అశాంలపై స్పందిస్తూ ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఆయన తాజాగా.. ఓ వ్యక్తి చేసిన సాహసంపై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ లో స్పందించారు. రైలు పట్టాలపై పడిన బాలికను రక్షించడం ద్వారా ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఓ వ్యక్తి వీడియోను రీట్వీట్ చేశారు. “నేను ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ వారాన్ని ప్రారంభించాను. నమ్మశక్యం కాని ధైర్యం.. అపురూపమైన నిస్వార్థత.. ఇన్‌క్రెడిబుల్ ఇండియా.. మన చుట్టూ రోల్ మోడల్స్ ఉన్నారు” అని మహీంద్రా ఆ వ్యక్తి వీరోచిత చర్య  వీడియోతో పాటు ట్వీట్ చేశారు. మహీంద్రా బాస్ తన ట్వీట్‌ను ‘#MondayMotivation’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముగించారు. ఆ వ్యక్తి , అతని పని పట్ల తనకున్న అభిమానాన్ని సూచిస్తారు.

రైలు పట్టాలపై పడిన బాలికను ఒక వ్యక్తి రక్షించిన వీడియో దేశంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతంలో చోటుచేసుకుంది.  ఫిబ్రవరి 5న, మెహబూబ్ తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా.. పాదచారులు రైలు ట్రాక్ దాటేందుకు కోసం వేచి ఉన్నారు. ఆ తర్వాత రైలు ఆగడంతో ప్రజలు ట్రాక్‌ దాటడం మొదలు పెట్టారు.

అయితే.. కొద్దిసేపటికే ఘటనా స్థలంలో అలజడి వినిపించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా బాలిక రైలు పట్టాలపై పడిపోయింది. అయితే రైలు ఆమె వైపు రావడం గమనించిన అక్కడ ఉన్నవారు ఆందోళనతో అరవడం మొదలుపెట్టారు. షాక్‌లో ఉన్న అమ్మాయి లేచి నిలబడలేకపోయింది. మెహబూబ్ ట్రాక్ వైపు దూసుకెళ్లి పట్టాలపైకి డైవ్ చేస్తాడు. బాలికను సురక్షితంగా తీసుకువెళ్లడానికి సమయం లేకపోవడంతో.. మెహబూబ్ ట్రాక్ మధ్యలో ఆమె వైపు క్రాల్ చేశాడు. అనంతరం బాలిక బ్యాగ్‌ని తీసుకుని ఆమె తలపై ఉంచి కిందికి అదిమి పట్టుకుంటాడు.

వైరల్ వీడియోలో రైలు వారి మీదుగా వెళుతున్నప్పుడు మెహబూబ్ అమ్మాయి చేయి పట్టుకుని ఆమెను రక్షించుకోవడం చూడవచ్చు. మెహబూబ్‌కి ఆ అమ్మాయి, ఆమె కుటుంబం, ఆమె పుట్టింటి గురించి తెలియదు. అయితే ప్రమాదంలో ఉన్న బాలికను చూసి ఆమె ప్రాణాలను కాపాడేందుకు రైలు కింద దూకాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు  లైక్‌ చేయడమే కాదు విపరీతంగా షేర్‌ చేశారు. అయితే ఇదే వీడియోను ఆనంద్ మహీంద్ర రీట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి: మూడు రాష్ట్రాల పోలింగ్ అప్ డేట్స్ ఇక్కడ చూడండి

High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..