Kid Video Viral: తండ్రితో కలిసి టీవీ చూస్తున్న చిన్నారి.. నాన్న ఫీలింగ్స్ ను అనుసరిస్తున్న బాలుడు ఫన్నీ వీడియో వైరల్
చిన్నారి బాలుడి వయసు.. చూస్తుంటే అతనికి ఆనందానికి, దుఃఖానికి కారణం ఏంటో తెలీదు.. అయితే టీవీలో ఆనందంగా ఉన్నవాళ్ళని చూసిన తాను సంతోషించాడు. తన తండ్రి దిగులుగా ఉండడం చూసి.. తాను కూడా విచారం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ఫాస్ట్ యుగం నడుస్తోంది. చాలా విషయాలు మన కళ్ల ముందుకి వస్తాయి.. అంతే త్వరగా కనుల ముందు నుంచి అదృశ్యం అవుతాయి. అయితే మన దృష్టిని ఆకర్షించి.. కళ్ళు, మనసు అక్కడే ఆగిపోయేవి ప్రపంచంలో చాలా ఉన్నాయి. తరచుగా ఈ ఇలాంటి వీడియోలు సోషల్ వీడియోల్లో కనిపిస్తూనే ఉంటాయి. చిన్న పిల్లకు చెందిన అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో చూసిన తర్వాత.. మీరు దీన్ని మీ స్నేహితులతో ఖచ్చితంగా పంచుకుంటారు
లోకం తెలియని పసివాళ్లు తమ కనుల ముందు కనిపించిన విషయాలు త్వరగా నేర్చుకుంటారు. అంతేకాదు కొన్నింటిని తాను కాపీ చేయడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇంట్లో తమ కుటుంబ సభ్యులు చేసే పనులు చూస్తే..వ్ వాటిని అనుసరించడం మొదలు పెడతారు. అలాంటి ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇది ప్రజలను బాగా అలరిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో తండ్రితో కలిసి చిన్నారి బాలుడు మ్యాచ్ ని చూస్తున్నాడు. ఈ సమయంలో అతని తండ్రి ఎగ్జైట్ మెంట్ చేసిన పనిని చూసి పిల్లవాడు కూడా కాపీ కొట్టడం మొదలుపెట్టాడు.




ఇక్కడ వీడియో చూడండి
2-year-old Theo watching a game with his dad.. ?
? IG: marika.m.hjorth pic.twitter.com/IAmv7DRnBi
— Buitengebieden (@buitengebieden) December 27, 2022
ఓ చిన్నారి తన తండ్రితో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. చిన్నారి బాలుడి వయసు.. చూస్తుంటే అతనికి ఆనందానికి, దుఃఖానికి కారణం ఏంటో తెలీదు.. అయితే టీవీలో ఆనందంగా ఉన్నవాళ్ళని చూసిన తాను సంతోషించాడు. తన తండ్రి దిగులుగా ఉండడం చూసి.. తాను కూడా విచారం వ్యక్తం చేశాడు. తండ్రిలాగే కొడుకు కూడా విసుగు చెంది తన మొహం మీద చిట్టి చేతిని వేసుకుని మరీ దిగులుని వ్యక్తం చేశాడు.
ఈ వీడియో @buitengebieden అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. దానితో అతను ఫన్నీ క్యాప్షన్ రాశాడు. వార్తలు రాసే సమయానికి, 34 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను చూశారు మరియు వారి అభిప్రాయాన్ని వ్యాఖ్యానించడం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ చిన్నారి నిజంగా చాలా అందమైనదని మరియు నేను దానితో ప్రేమలో పడ్డానని ఒక వినియోగదారు చెప్పారు. ఈ సంవత్సరం నేను చూసిన అత్యుత్తమ విషయం ఇదే అని మరొక వినియోగదారు రాశారు, అద్భుతం! ఇది కాకుండా, చాలా మంది ఇతర వినియోగదారులు ఈ వీడియోను వివిధ మార్గాల్లో ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
