Flyers protest: ఇండిగో విమానం రద్దుతో ఆగ్రహించిన ప్రయాణికులు.. ఎయిర్‌ పోర్టులో బీభత్సం సృష్టించారు..

అయితే ఆ విమానాన్ని ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో విమాన ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. ఇండిగో విమానాన్ని రద్దు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ‘ఇండిగో చోర్ హై, బంద్‌ కరో’ అంటూ నినాదాలు చేశారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు పెద్దఎత్తున బీభత్సం సృష్టించారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం చెలరేగింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Flyers protest: ఇండిగో విమానం రద్దుతో ఆగ్రహించిన ప్రయాణికులు.. ఎయిర్‌ పోర్టులో బీభత్సం సృష్టించారు..
Flyers Protest
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2024 | 8:06 PM

ఇండిగో ఎయిర్‌లైన్స్ విషయంలో మొదలైన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ విమానయాన సంస్థ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు డియోఘర్ వెళ్లే ఇండిగో విమానాన్ని రద్దు చేయడం వల్ల ప్రయాణీకుల అసంతృప్తికి కారణంగా మారింది.. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

జార్ఖండ్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నిరసనకు దిగారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నం విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఎయిర్‌పోర్టులో నిరసనకు దిగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఇండిగో విమానం 6ఈ 2198 ఢిల్లీ నుంచి జార్ఖండ్‌లోని డియోగఢ్‌కు బుధవారం తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంది. అయితే ఆ విమానాన్ని ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో విమాన ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. ఇండిగో విమానాన్ని రద్దు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ‘ఇండిగో చోర్ హై, బంద్‌ కరో’ అంటూ నినాదాలు చేశారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు పెద్దఎత్తున బీభత్సం సృష్టించారు. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం చెలరేగింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

దీనిపై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు స్పందిస్తూ.. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌, ల్యాండింగ్‌ జరుగుతున్నప్పుడు CAT IIIలో లేని విమానాలకు సమస్య తలెత్తవచ్చు. ప్రయాణికులు ఎయిర్‌లైన్స్‌లను సంప్రదించి సమాచారం తెలుసుకోవాలని కోరుతున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..